FbTelugu

జ‌గ‌న్ అన్న‌కు ఎందుకు కోపం వ‌చ్చిందీ!

why-jagan-angry-about-ap-politics

151 అసెంబ్లీ సీట్లు గెల‌వటం సాధార‌ణ‌మైన అంశం కాదు. పైగా ప్ర‌తిప‌క్షం హోదా అనేది ఏ పార్టీకీ ద‌క్క‌కుండా పోవ‌టం అంత ఆషామాషీ కాదు. ప్ర‌జ‌ల మ‌న‌సు అంత‌గా గెలిచి.. విజ‌యాన్ని సాధించిన నేత‌గా వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి చ‌రిత్ర‌లో నిలిచిపోతారు. తాను కూడా అదే భావించారు. తండ్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి ప్ర‌జ‌ల అభిమానాన్ని చూర‌గొన్నారో.. అంత‌గా తాను కూడా ప్ర‌తి ఒక్క‌రి గుండెల్లో ఉండిపోవాల‌ని త‌ప‌న ప‌డ్డాడు.. ప‌డుతున్నాడు. అందుకే.. ఎవ‌రిపై నోరు మెద‌ప‌ట్లేదు. తాను మాత్రం ఎంచుకున్న‌మార్గంలో న‌డ‌క సాగిస్తున్నాడు. త‌న‌తో వ‌స్తున్న వారిని కూడా త‌న‌నే అనుస‌రించ‌మ‌ని మాత్ర‌మే చెబుతున్నాడు. ఇంత ఉపోద్గాతం అవ‌స‌ర‌మా అంటే.. అవ‌స‌ర‌మే. జ‌గ‌న్‌పై బోలెడు కేసుల‌.. ల‌క్ష‌కోట్ల అవినీతి అయినా.. జ‌నం మెచ్చారు. చంద్ర‌బాబు పాల‌న అనుభం.. అప‌ర‌చాణ‌క్యుడుగా కీర్తి ప్ర‌తిష్ఠ‌లు.. నిజాయ‌తీకు నిలువుట‌ద్దం ప‌వ‌న్ కు ఇమేజ్ ఉన్న ఇమేజ్ ఇవ‌న్నీ ఏమీ.. జ‌గ‌న్ గెలుపును.. ప్ర‌జ‌ల్లో జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి పేరును దెబ్బ‌తీయ‌లేక‌పోయాయి కాబ‌ట్టే.. అంత‌టి మెజార్టీ. అటువంటి నేత‌.. త‌న కేబినెట్‌లో చేర్చుకున్న వారిపై కూడా అంతే న‌మ్మ‌కం ఉంచాడు. కానీ.. చాలా మంది మంత్రులు కేవ‌లం ప్రేక్ష‌క‌పాత్ర వ‌హిస్తున్నారు. అనిల్‌కుమార్ యాద‌వ్‌, బుగ్గ‌న , సుచ‌రిత వంటి కీల‌క నేత‌లు కాస్త అస‌హ‌నంతో ఉన్నార‌ట‌. కొంద‌రు మంత్రుల ప‌నితీరు అస్స‌లు బాగాలేద‌ట‌. కోరి మ‌రీ సీనియ‌ర్ల‌ను ప‌క్క‌న‌బెట్టి మంత్రిప‌ద‌వులు క‌ట్ట‌బెడితే అంత ఉత్సాహంగా ప‌నిచేయ‌ట్లేద‌నే ఆవేద‌న సీఎంలో ఉంద‌ని తెలుస్తోంది. ప్రభుత్వం చేప‌ట్టిన ప‌థ‌కాలు, తీసుకుంటున్న కీల‌క నిర్ణ‌యాలు, పోల‌వ‌రంపై ర‌వ‌ర్స్ టెండ‌రింగ్‌, అమ‌రావ‌తి నిర్మాణంలో అవ‌త‌వ‌క‌ల‌పై జ‌నంలోకి బ‌లంగా తీసుకెళ్ల‌టంలో దాదాపు స‌గం మందికి పైగా మంత్రులు ప్లాప్ అయ్యార‌ట‌. ఇటీవ‌ల జ‌రిగిన కేబినెట్‌లోనూ సీఎం హోదాలో జ‌గ‌న్ అడిగిన ప్ర‌శ్న‌ల‌కు కొంద‌రు అమాత్యులు త‌మ శాఖ‌కు సంబంధించిన స‌మాచారాన్ని ఇవ్వ‌లేక‌పోయార‌ట‌. ఈ లెక్క‌న ప‌ద‌వులు చేప‌ట్టి ఎంత‌టి నిర్ల‌క్ష్యంగా ఉన్నార‌నేది తెలుస్తోందంటూ గ‌ట్టిగానే క్లాసు తీసుకున్నార‌నే గుస‌గుస‌లు పార్టీ వ‌ర్గాల్లో వినిపిస్తున్నాయి.

You might also like