FbTelugu

‘ఈసీ రమేష్ కుమార్ చేసిన తప్పేంటీ ?’: అచ్చెనాయుడు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఆర్డినెన్స్ ద్వారా తొలగించడంపై టీడీపీ ఎమ్మెల్యే అచ్చెనాయుడు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు రమేష్ కుమార్ చేసిన తప్పేంటని జగన్ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు.

తమ మాట వినలేదన్న ఒకే ఒక కారణంతో కక్షగట్టి అతనిపై వేటు వేశారని ఆరోపించారు. ఎలక్షన్ కమిషనర్ అనే పదవి రాజ్యాంగ బద్దమైనదని వీరు ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు. దీనిపై సీపీఐ నారాయణ మాట్లాడుతూ.. రమేష్ కుమార్ ని ఆర్టినెన్స్ ద్వారా తొలగించారని.. జీవో ఇస్తే కోర్టుకు వెళ్లే అవకాశం ఉన్నందునే ఇలా చేశారన్నారు. ఇలా చేయడం తప్పని అన్నారు.

You might also like