FbTelugu

తక్కువ టెస్టులు చేస్తున్నారెందుకు? : ఉత్తమ్

జగిత్యాల: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఎందుకు తక్కువ కరోనా టెస్టులు చేస్తుందో సమాధానం చెప్పాలని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. ఇవాళ ఆయన జగిత్యాలలో పర్యటించారు. ఈ సందర్భంగా పలు వ్యాఖ్యలు చేశారు.

కరోనా ప్రభావం చైనా కన్నా భారత్ లోనే అధికంగా ఉందని అన్నారు. సరైన టెస్టులు చేస్తేనే కరోనాను కంట్రోల్ చేయడం సాధ్యమన్నారు. ఉద్యోగులకు, పెన్షనర్లకు జీతాలు కట్ చేయడం దారుణమన్నారు. గల్ఫ్ నుంచి వస్తున్న వారికి అన్ని ఖర్చులూ ప్రభుత్వమే భరించాలన్నారు.

You might also like