FbTelugu

ఒక్క మాస్క్ ధర అంతా?

ముంబై: ఫ్రంట్ లైన్ వారియర్స్ కోసం మరో మాస్క్ ను తయారు చేశారు. ప్రయోగ దశలో ఉన్న ఈ మాస్క్ త్వరలో మార్కెట్ లోకి రానున్నది. గాలిని  99.97 ఇది శుద్ధి చేస్తుందని తయారీదారులు స్పష్టం చేస్తున్నారు.

ప్రస్తుతం ఫ్రంట్ లైన్ వారియర్స్ అయిన వైద్యులు, సిబ్బంది ఎన్ 95 మాస్కులను వినియోగిస్తున్నారు. ఇది కూడా అంత ప్రయోజనకరం కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) హెచ్చరించిన నేపథ్యంలో కొత్త మాస్క్ రూపకల్పన పై పడ్డారు. ముంబైకి చెందిన సుమిత్ రౌత్, లండన్ భాగస్వామి రాహుల్ ఘోరే ఈ మాస్కును అభివృద్ధి చేశారు. వైద్యులు, సిబ్బందిని దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి పరిచిన దీనికి ఎక్స్ డీ  అని నామకరణం చేశారు.

దీనిని రూపొందించేందుకు నాలుగు నెలల సమయం పట్టిందని, ఒక్కో మాస్క్ ధర రూ.1200 వరకు ఉంటుందన్నారు. ప్రభుత్వ అనుమతులు లభించిన వెంటనే మార్కెట్ లోకి విడుదల చేస్తామన్నారు.

You might also like