FbTelugu

ముస్లిం ఫ్రంట్ పై ఈడీ దాడులు

న్యూఢిల్లీ: నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (ఫీఎఫ్ఐ) మనీ ల్యాండరింగ్ కేసులో ఇవాళ పలు రాష్ట్రాల్లో 26 ప్రదేశాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది.

పీఎఫ్ఐ చైర్మన్ ఓమ్ అబ్దుల్ సలామ్, కేరళ రాష్ట్ర అధ్యక్షుడు నసీరుద్దీన్ ఎలమారమ్, నివాసాల్లో తనిఖీలు నిర్వహించి డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నది. తమిళనాడు, పశ్చిమబెంగాల్, కర్నాటక, బిహార్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, ఢిల్లీ, కేరళలో ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. మనీ ల్యాండరింగ్ కేసులో ఆధారాల కోసం ఈ సోదాలు నిర్వహించారు.
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన అల్లర్లకు నిధులను పీఎఫ్ఐ సమకూర్చినట్లు బలమైన ఆధారాలు లభించడంతో ఈడీ విచారణ చేపట్టింది. పీఎఫ్ఐ బ్యాంకు ఖాతాల్లో సుమారు రూ.120 కోట్ల లావాదేవీలు జరిగినట్లు వెల్లడైంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.