FbTelugu

ఎవరేం చేస్తున్నారో.. ప్రజలకు తెలుసు: ఎర్రబెల్లి

హైదరాబాద్: తెలంగాణలో ఏపార్టీ నాయకులు ఏం చేస్తున్నారో ప్రజలకు తెలుసునని టీఆర్ఎస్ రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఇవాళ ఆయన కాంగ్రెస్, బీజేపీలను ఉద్దేశించి పలు విమర్శలు చేశారు.

కాంగ్రెస్, బీజేపీ నేతలు మూర్ఖంగా మాట్లాడుతున్నారని అన్నారు. ఇక ముందు కాంగ్రెస్, బీజేపీలను ప్రజలు ఉరికిచ్చి కొడతారని జోస్యం చెప్పారు. ఆ రెండు పార్టీలు తమ హయాంలో ఒక్క ప్రాజెక్టునూ పూర్తిచేయలేదని అన్నారు.  ప్రాజెక్టులను పూర్తి చేసి నీరిచ్చిన ఘనత సీఎం కేసీఆర్ దేనన్నారు.

You might also like