FbTelugu

రేపు ఏలూరుకు డబ్ల్యూహెచ్ఓ బృందం

ప.గో.జిల్లా: ఏలూరులో అంతుబట్టని వింత వ్యాధి వ్యవహారం అంతర్జాతీయ స్థాయికి వెళ్లింది. వైద్య నిపుణులకే ఈ అర్థంకాని జబ్బుపై అధ్యయనం చేయాలంటూ ఏపీ ప్రభుత్వం ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ)ను సహాయం కోరింది.

దీనికి డబ్ల్యూహెచ్ఓ ప్రతినిధులు కూడా సమ్మతి తెలిపారు. ఏలూరు వింత వ్యాధులపై అధ్యయనం చేసేందుక డబ్ల్యూహెచ్ఓ నుంచి ఓ ప్రతినిధి బృందం రేపు ఏలూరు కు రానున్నది. ఇప్పటికే ఏలూరు సమస్యకు కారణమేంటన్నది తేల్చేందుకు దేశీయ సంస్థలు సీసీఎంబీ, ఎన్ఐఎన్, ఐఐసీటీ నిపుణులు అధ్యయనం చేస్తున్నట్లు సమాచారం. ఇవ్వాళ సాయంత్రం వరకు ఏలూరులో బాధితుల సంఖ్య 451కి పెరిగింది. వారిలో 263 మంది కోలుకుని డిశ్చార్జి కాగా, కొందరి పరిస్థితి విషమించడంతో వారిని విజయవాడ, గుంటూరు ఆసుపత్రులకు తరలించారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు నలుగురు ప్రాణాలు కోల్పోయారని బాధిత కుటుంబాలు ఆరోపిస్తున్నాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.