FbTelugu

వచ్చేవారం చైనాకు డబ్ల్యూహెచ్ఓ బృందం

ప్రపంచం మొత్తం అతలాకుతలం అయిన తరువాత ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) మేల్కొన్నది. కరోనా వైరస్ గుట్టు విప్పేందుకు వచ్చేవారం చైనా డబ్ల్యూహెచ్ఓ బృందం వెళ్లనున్నది.

ఈ మేరకు డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అధనామ్ గేబ్రేయేసస్ ప్రకటించారు. ఇందుకోసం వచ్చేవారంలో చైనా వెళ్లేలా ఓ బృందాన్ని సిద్ధం చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ పర్యటన ద్వారా వైరస్ ఎలా ప్రారంభమైంది, దాని మూలం ఏంటనేది తెలియనున్నది అన్నారు. దీంతో వైరస్ పై సమగ్ర అవగాహన సాధించగలమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
చైనా దేశం లోని వుహాన్ కేంద్రంగా ఆరు నెలల క్రితం వెలుగుచూసిన ఈ మహమ్మారి ఇప్పటికే 5 లక్షల మందిని బలితీసుకున్నది. పాజిటివ్ కేసుల సంఖ్య ఒక కోటికి చేరుతోంది. ముందు ముందు మరింత విజృంభించే అవకాశం ఉంది. వైరస్ వ్యాప్తికి చైనానే కారణమని అమెరికా దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదటి నుంచి వాదిస్తున్నాడు. గుట్టు విప్పేందుకు డబ్ల్యూహెచ్‌ఓ బృందాన్ని పంపి దర్యాప్తు జరపాలని అమెరికా డిమాండ్ చేస్తున్నది. ఈ నేపథ్యంలోనే డబ్ల్యూహెచ్‌ఓ ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకున్నది.

You might also like

Leave A Reply

Your email address will not be published.