FbTelugu

ఆదిపురుష్ లో లక్ష్మణుడు, సీత పాత్రదారులెవరు?

భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్న పాన్ ఇండియా మువీ ఆదిపురుష్ లో ఇంత వరకు లక్ష్మణుడు, సీతాదేవీ పాత్రలకు నటుల పేర్లు ఖరారు కాలేదు. బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఓం రౌత్ రూపొందిస్తున్న చిత్రం ఆదిపురుష్ పై భారీ అంచనాలు ఉన్నాయి.

రాముడిగా హీరో ప్రభాస్, రావణుడిగా సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. లక్ష్మణుడు, సీతాదేవీ పాత్రల గురించి ఇంకా పేర్లు వెల్లడి కాలేదు. మహేష్ బాబు సరసన వన్, నేనొక్కడినే చిత్రంలో నటించిన కృతి సనన్ ను సీతాదేవీ పాత్రకు పరిశీలించినట్లు వార్తలొస్తున్నాయి. దీనితో పాటుగా లక్ష్మణుడి పాత్రకు బాలీవుడ్ నటుడు సన్నీసింగ్ ను తీసుకుంటున్నారని అంటున్నారు. వీరిద్దరి పేర్లు దాదాపు ఖరారు అయినట్లు వార్తలొస్తున్నా దర్శకుడు ఓం రౌత్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. టీ సిరీస్ సంస్థ 3డీ, 2డీ లో ఈ సినిమాను నిర్మాణం చేస్తున్నది.

You might also like

Leave A Reply

Your email address will not be published.