FbTelugu

విజ‌యారెడ్డి హ‌త్య కేసులో ఎమ్మెల్యే ఎవ‌రు?

Who-is-the-MLA-in-the-Vijayaraddy-murder-case

ప్రభుత్వ అధికారుల్లో సంచ‌ల‌నం రేకెత్తించిన అబ్దుల్లాపూర్‌మెట్ త‌హ‌సీల్దార్ విజ‌యారెడ్డి హ‌త్య కేసులో సూత్ర‌దారులెరు? ఆమెను అంత‌టి దారుణంగా కాల్చేటంత‌టి అప‌కారం ఏం చేసింది? కేసులో నిందితుడు సురేష్ మ‌తిభ్ర‌మించిన వ్య‌క్తిగా ప్ర‌చారం సాగుతుంది. అత‌డి త‌ల్లి కూడా మా వాడు అమాయ‌కుడు అంటుంది. కానీ.. హ‌త్య‌కు ప‌క్కాగా ప్లాన్ చేశాడు. పెట్రోల్ పోశాడు. నిప్పంటించి చ‌నిపోయిన‌ట్టు నిర్ద‌ార‌ణకు రాగానే ద‌ర్జాగా పోలీస్‌స్టేష‌న్‌కు వెళ్లాడు. పైగా తాను పాసుపుస్త‌కాలు ఇవ్వ‌క‌పోవ‌టం వ‌ల్ల‌నే హ‌త్య‌చేసిన‌ట్టు ఒప్పుకున్నాడు. అయితే ఎటువంటి క్రిమిన‌ల్ బ్యాక్ గ్రౌండ్ లేని ఓ వ్య‌క్తి.. హ‌త్య చేసి ఇంత నింపాదిగా ఎలా వ్య‌వ‌హ‌రించాడ‌నేది స‌స్పెన్స్‌.

వాస్త‌వానికి హైద‌రాబాద్ మహానగరం చుట్టుప‌క్క‌ల వేలాదిగా భూ వివాదాలున్నాయి. నిజాం భూములు, ఇనాం భూములు, వార‌స‌త్వం త‌గాదాలు, ప్ర‌భుత్వ స్థ‌లాలు ఇలా కోట్లు ప‌లికే భూములు అమ్మి సొమ్ము చేసుకునేందుకు మాఫియా రెడీగా ఉంటుంది. పోలీస్‌, లాయ‌ర్లు, రాజ‌కీయ‌నేత‌లు, మీడియా నాలుగూ భూ మాఫియాలో కీల‌క పాత్ర పోషిస్తుంటాయి. ఎవ‌రికి వారు ఒక్క సెటిల్‌మెంట్‌తో రాత్రికిరాత్రి కోట్లు సంపాదించ‌వ‌చ్చ‌ని ఎత్తులు వేస్తుంటారు. ఇక్క‌డ కూడా అదే జ‌రిగింది. కోట్లు ప‌లికే భూమిపై త‌మ‌కూ హ‌క్కుంద‌ని సురేష్ అనే వ్య‌క్తి.. ఓ ఎమ్మెల్యే వ‌ద్ద‌కు వెళ్లాడు. ల‌క్ష‌లు కుమ్మ‌రించాడు. ప‌నిగాక‌పోవ‌టం వ‌ల్ల ఎమ్మెల్యే తానే స్వ‌యంగా త‌హ‌సీల్దార్‌కు వార్నింగ్ ఇచ్చాడు. దీంతో ఆమె త‌న‌ను అక్క‌డ నుంచి బ‌దిలీ చేయ‌ట‌మంటూ రంగా రెడ్డి జిల్లా క‌లెక్ట‌ర్‌ను కోరింది. ఇదీ ఇప్పుడు జ‌రుగుతున్న ప్ర‌చారం.

కానీ.. దీని వెనుక‌.. అస‌లు సూత్ర‌దారులెవ‌రు.. విజ‌యారెడ్డిని పావుగా వాడుకుని లాభ‌ప‌డిందెవ‌రు అనేది కూడా స‌స్పెన్స్‌గా మారింది. అధికశాతం మ‌హిళా ఉద్యోగులు, అధికారుల వెనుక కుటుంబ స‌భ్యులు షాడోలుగా ఉంటారు. అంతా తామై చ‌క్రం తిప్పుతుంటారు. ఏ సెటిల్‌మెంట్ జ‌ర‌గాల‌న్నా.. సంత‌కం చేయించాల‌న్నా.. వారే ఆమెతో న‌డిపిస్తారు. ఎంత నిజాయ‌తీగా ప‌నిచేయాల‌ని వారు భావించినా షాడోల దెబ్బ‌కు అవినీతి మ‌కిలి అంటించుకోవాల్సిందే. విజ‌యారెడ్డి కేసులోనూ సొంత భర్తే షాడోగా మారాడ‌ని తెలుస్తోంది. విలువైన భూమిని కాజేసేందుకు ప్లాన్ చేశారు. అక్క‌డ‌.. మొద‌లైన వివాదం.. చివ‌ర‌కు త‌హ‌సీల్దార్‌ను బ‌లితీసుకుంది. అంత‌వ‌ర‌కూ అయితే ఓకే.. కానీ.. విజ‌యారెడ్డి త‌హ‌సీల్దార్ కావ‌టానికి ముందు.. ఓ అమ్మ‌.. ఇద్ద‌రు పిల్ల‌ల‌కు అన్నీతానై బ‌తికే మాతృదేవ‌త‌. ఇప్పుడా పిల్ల‌ల‌కు అమ్మ దూర‌మైంది.. భూ వివాదాల‌కు బలై.. అమ్మ‌పిలుపును దూరం చేసింది. ఈ పాపంలో భాగం ఎవ‌రికి ఉన్నా.. శాపం మాత్రం ఆ పిల్ల‌ల్ని వెంటాడుతోంది.

You might also like