FbTelugu

బ్లీచింగ్ స్కాంలో వైసీపీ నేత‌లెవ‌రు?

ఒక‌టీ రెండూ.. కాదు ఏకంగా రూ.100 కోట్ల వ్య‌వ‌హారం. కేవ‌లం కోటి రూపాయ‌ల ఖ‌ర్చుతో రూ.99 కోట్లు కొట్టేసేందుకు ప్లాన్ వేశారు. అంతా ప‌క్కాగా నడిపించారు.

ఎక్క‌డో ప‌థ‌కం బెడ‌సికొట్టింది. అస‌లుకే మోసం వ‌చ్చింది. పార్టీ నేత‌లు చేసిన పాపం ఇప్పుడు ప్ర‌భుత్వానికి స‌వాల్‌గా మారింది. నిజ‌మే మీరు చ‌దివిన వ్య‌వ‌హారం గుంటూరు జిల్లా పిడుగురాళ్ల కేంద్రంగా జ‌రిగిన బ్లీచింగ్ స్కామ్‌. మొన్న అర్ధాంత‌రంగా నిలిచిపోయిన్మ‌ మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో కోట్లు కుమ్మ‌రించి గెల‌వాల‌ని వైసీపీ గ‌ట్టిగానే ప‌థ‌క ర‌చ‌న చేసింది. దానికోసం ముందుగానే కోటిరూపాయ‌ల మందు కూడా తెచ్చార‌ట‌. ఇంత‌లో ఎన్నిక‌ల సంఘం క‌రోనా బూచిని చూపి ఎన్నిక‌లు ర‌ద్దు చేశారు. ఇంత‌లోనే లాక్‌డౌన్ ఆంక్ష‌లు.

ఫ‌లితంగా ఎక్క‌డి మందు అక్క‌డే ఉంచారు. బ్లాక్‌మార్కెట్‌లో రెట్టింపు ధ‌ర‌కు అమ్మేసి రెండుకోట్లు కూడ‌బెట్టార‌ట‌. అదే పిడుగురాళ్ల‌లో బ్లీచింగ్ త‌యారు చేసి ఏపీ వ్యాప్తంగా స‌ర‌ఫ‌రా చేశారు. ప‌ల్నాడులో సున్నం, ముగ్గు త‌యారీ కేంద్రం వేలాది మంది కార్మికులు.. కోట్లాదిరూపాయ‌ల వ్యాపారం సాగుతుంటుంది. మైనింగ్ మాఫియాకు అదే సామ్రాజ్యం. ఇంత‌టి ప్ర‌త్యేక‌త‌లున్న పిడుగురాళ్ల‌లో బ్లీచింగ్ పేరిట సున్నం క‌లిపి దానిలో కొన్ని ప‌దార్ధాల‌ను మిక్స్ చేసి వివిధ జిల్లాల‌కు స‌ర‌ఫ‌రా చేశారు. క‌రోనా వ్యాపించ‌కుండా ప‌ల్లెలు, ప‌ట్ట‌ణాలు, న‌గ‌రాల్లో చ‌ల్ల‌టంతో బ్లీచింగ్‌కు ఫుల్ గిరాకీ పెరిగింది. దీన్ని సొమ్ము చేసుకునేందుకు వైసీపీ నేత ఒక‌రు చ‌క్రంతిప్పాడ‌నే ఆరోప‌ణ‌లున్నాయి. దీనిపై గుంటూరు క‌లెక్ట‌ర్ విచార‌ణ ప్రారంభించారు. కానీ.. జిల్లా అధికారి మాత్రం గ్రామ పంచాయ‌తీల్లోని స‌ద‌రు బ్లీచింగ్‌ను బ‌య‌టకు చూప‌వ‌ద్ద‌నే ఆదేశాలిచ్చార‌నే ఆరోప‌ణ‌లున్నాయి.

దీనిపై ముఖ్య‌మంత్రి కార్యాల‌యం కూడా స‌మాచారం సేక‌రిస్తున్న‌ట్టు స‌మాచారం. ఏమైనా కోట్లాదిరూపాయ‌ల కుంభ‌కోణం.. వైసీపీను బాగానే ఇరుకున పెడుతుంది. మ‌రి దీన్నుంచి బ‌య‌ట‌ప‌డి పార్టీకు, ప్ర‌భుత్వానికి సంబంధం లేద‌ని నిరూపించుకోవ‌టం ఇప్పుడు జ‌గ‌న్ ఎదుట ఉన్న స‌వాల్‌.

You might also like