జగిత్యాల: ఉత్తర భారతం రాముడు మనకెందుకు, మన దగ్గర రాముడు లేడా అంటూ కోరట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు కొత్త వివాదానికి తెరలేపారు. అయోధ్యలో నిర్మాణం చేసే రామాలయానికి విరాళాలు ఇవ్వొద్దంటూ ఆయన పిలుపునిచ్చారు.
ఇవాళ విద్యాసాగర్ రావు మీడియాతో మాట్లాడుతూ, బీజేపీ నాయకులు రాముడు పేరు మీద బిక్షమెత్తుకుంటున్నారని, కొత్త నాటకానికి తెరలేపారని ఆయన ధ్వజమెత్తారు. కుంకుమ బొట్టు పెట్టుకుంటేనే రాముని భక్తులమా? తాము కూడా శ్రీరాముడి భక్తులమేనని ఆయన అన్నారు.