FbTelugu

ప్రైవేటు హాస్పిటళ్లకు వ్యాక్సిన్లు ఎవరిస్తున్నారు?

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ రాష్ట్రాలకు వ్యాక్సిన్లు ఇవ్వకుండా ప్రైవేటు హాస్పిటళ్లకు పంపిణీ చేస్తున్నదని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఆరోపించారు. రాష్ట్రాలకు ఇచ్చేందుకు లేని వ్యాక్సిన్లు… ప్రైవేటు కు ఎలా వెళ్తున్నాయని ఆయన నిలదీశారు.

ఢిల్లీలో 18 నుంచి 44 ఏళ్ల వారికి వ్యాక్సిన్లు ఇచ్చేందుకు స్టాక్ అందుబాటులో లేదన్నారు. గత్యంతరం లేక వారికి ఇచ్చే కార్యక్రమాన్ని గతవారమే నిలిపివేశామని మనీష్ సిసోడియా అన్నారు. ఉత్పత్తి లేదు, స్టాక్ లేదంటూ కేంద్రం తన బాధ్యతల నుంచి తప్పించుకుంటున్నదని ఆయన విమర్శించారు. 18 నుంచి 44 ఏళ్ల వారికి జూన్ లో వ్యాక్సిన్లు అందుబాటులో ఉంటాయని రాష్ట్రాలకు చెప్పింది కాని, జూన్ లో సాధ్యం కాకపోవచ్చన్నారు. పది మిలియన్ డోసులు సేకరించేందుకు ఢిల్లీ ప్రభుత్ బహిరంగ టెండర్లు పిలిచిందని, జూన్ ఏడో తేదీలోపు ఆసక్తిని తెలియచేయాలని కోరామన్నారు. ఢిల్లీలో ప్రస్తుతం రోజుకు వేయికి అటు ఇటుగా కేసులు వస్తుండడంలో సడలింపులు ఇచ్చే దశగా ప్రయత్నిస్తున్నారు. సోమవారం నుంచి లాక్ డౌన్ ఆంక్షలు సడలించే అవకాశాలు ఉన్నాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.