FbTelugu

ఒక్క రోజులో 1.80 లక్షల కేసులు: డబ్ల్యూహెచ్‌ఓ

న్యూయార్క్: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ రోజురోజుకీ మరింత ఉద్ధృతంగా వ్యాపిస్తోంది.

శనివారం-ఆదివారం మధ్య 24 గంటల వ్యవధిలో ఏకంగా 1 లక్షా 83 వేల కేసులు నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) తెలిపింది. ఒక్క రోజు వ్యవధిలో ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి అని ప్రకటించింది.

అత్యధికగా బ్రెజిల్‌లో 54,771 కేసులు వెలుగులోకి రాగా.. అమెరికాలో 36,617, భారత్‌లో 15,413 కేసులు నమోదయ్యాయని పేర్కొంది. భారత్ లో మొన్నటి వరకు రెండు మూడు వేలకే పరిమితం అయిన కేసులు గత రెండు వారాలు గా రోజుకు పదివేలకు తగ్గకుండా కేసులు పెరుగుతున్నాయి. మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు రాష్ట్రాల్లో అత్యధిక కేసులు నమోదు అవుతుండడం ఆందోళన కలిగిస్తున్నది.

You might also like