FbTelugu

85 ఏళ్లలో తొలిసారి తెల్ల నెమలి నాట్యం

డెహ్రాడూన్: నెమలి నడుస్తూ వెళ్తుంటేనే వింతగా చూస్తాం. పురివిప్పి నాట్యం చేస్తే కళ్లార్పకుండా చూస్తుండి పోతాం. ఇప్పటి వరకు మనం రంగురంగుల నెమలికలను చూశాం. కాని ఉత్తరాఖండ్ లో తెల్ల నెమలి కనువిందు చేసింది.

కార్బెట్ టైగర్ రిజర్వ్ లోని కోతి రౌ సమీపంలో ఎప్పటి లాగే అటవీ శాఖ సిబ్బంది పెట్రోలింగ్ చేశారు. ఇక్కడ బ్లూ కలర్ పాటు గ్రీన్ కలర్ నెమలికలకు పేరొందింది. అయితే తెలుపు రంగు నెమలి కన్పించడంతో అటవీ శాఖ సిబ్బంది ఆశ్చర్యపోయారు. గత 85 సంవత్సరాలలో తొలిసారి తెల్ల నెమలికలు కన్పించాయని తెలిపారు. నిర్థారించుకునేందుకు మరుసటి రోజు వెళ్లగా అదే తారసడడంతో సంతోషానికి గురయ్యారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.