FbTelugu

గుంటూరు హాస్పిటళ్లపై కొరడా: జిల్లా కలెక్టర్

గుంటూరు: జిల్లా వ్యాప్తంగా కరోనా రోగులకు ఆరోగ్యశ్రీ పధకంలో 50 శాతం పడకలు ఇవ్వని ఆసుపత్రులపై చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ వివేక్ యాదవ్ తెలిపారు. గుంటూరు లో 12 హాస్పిటళ్లకు రూ.5 లక్షల చొప్పున, 25 హాస్పిటళ్లకు రూ.2 లక్షల చొప్పున, 15 హాస్పిటళ్లకు రూ.1 లక్ష చొప్పున జరిమానా విధించామన్నారు.

ప్రైవేటు హాస్పిటల్ యాజమాన్యాలు ఆరోగ్య శ్రీ లబ్ధిదారులకు 50 శాతం మంచాలు ఇవ్వాలని, నిర్ణీత సమయంలో రోగులుకు చికిత్స చేయాలని ఆయన సూచించారు. కరోనా రోగుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. జిల్లాలో ఆరోగ్య శ్రీ పథకం కింద అందుతున్న సేవలపై ఆయన సమీక్షించారు. ఈ పథకం కింద చికిత్స చేయమని ఎవరైనా చెప్పినా, తిరస్కరించినా ఆ హాస్పిటల్ పై చర్యలు తీసుకుంటామన్నారు. ఆరోగ్య మిత్రలు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ రోగుల అవసరాలను తీర్చాలని జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ సూచించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.