FbTelugu

శుభకార్యానికి వెళ్లి వస్తుండగా..

మంచిర్యాల జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర దుర్ఘటన జరిగింది. శుభకార్యానికి వెళ్లివస్తూ ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృత్యువాత పడ్డారు.

మంచిర్యాల జిల్లా మందమర్రికి చెందిన కొమురయ్య (48), సుజాత (40), కావ్య (18)లు బెల్లంపల్లి మండలం పెర్కపల్లిలో జరిగిన శుభకార్యానికి బైక్‌పై వెళ్లి వస్తుండగా మందమర్రి పట్టణంలోని అంతర్రాష్ట్ర రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో ఒకే కుటుంబానికి చెందిన కొమురయ్య, సుజాత, కావ్యలు మరణించారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు. ప్రమాదానికి కారణమైన వాహనం కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

You might also like