అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో జగన్ ఏడాది పాలనలో అభివృద్ధి ఎక్కడ ? అంటూ టీడీపీ నేత దేవినేని ఉమ ప్రశ్నించారు. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు. చిన్న ఉద్యోగాలకు లక్షలు వసూలు చేస్తున్నారని అన్నారు.
ఏం సాధించారని కేకులు కట్ చేస్తూ సంబరాలు చేసుకుంటున్నారని ప్రశ్నించారు. దోసెడు ఇసుక దొరకడం లేదని ఎమ్మెల్యేలు, మంత్రులే అడుగుతున్నారని అన్నారు. దీనిపై ముఖ్యమంత్రి జగన్ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.