FbTelugu

మన సిద్దూ ఎక్కడా?: ఇమ్రాన్‌ ఖాన్‌

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సిద్దు మధ్య మంచి ఫ్రెండ్ షిప్ ఉన్న విషయం తెలిసిందే. తాజాగా వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం మరోసారి బయట పడింది. సిద్దూను మన సిద్దూ అంటూ ఇమ్రాన్‌ సంబోధించడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్‌గా మారింది. పంజాబ్‌లోని డేరా బాబా నానక్‌ను పాకిస్తాన్‌లోని దర్బార్‌ సాహిబ్‌ గురుద్వారాతో కలిపే కర్తార్‌పూర్‌ కారిడార్‌ శనివారం పండుగ వాతావరణంలో ప్రారంభమైంది. సరిహద్దులకు సమీపంలోని డేరాబాబానానక్‌ వద్ద ప్రధాని మోదీ, కర్తార్‌పూర్‌లో పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ దీనిని లాంఛనంగా ప్రారంభించారు.

పాక్‌లోని కర్తార్‌పూర్‌ కారిడర్‌ ప్రారంభోత్సవానికి నవ్‌జ్యోత్‌ సింగ్‌ సిద్దూ ముఖ్య అతిథిగా హాజరైన విషయం తెలిసిందే. భారత్‌ నుంచి బయల్దేరిని యాత్రికుల బృందం కోసం కర్తార్‌పూర్‌లో పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌తో పాటు అక్కడి నాయకులు ఎదురు చూశారు. ఈ సందర్బంగా ‘మన సిద్దూ ఎక్కడా’అంటూ ఇమ్రాన్‌ ఆసక్తిగా అక్కడ ఉన్నవారిని అడిగారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్‌గా మారింది. కార్యక్రమంలో సిద్దూ పాక్‌ ప్రధానిపై ప్రశంసలు కురిపించాడు. కర్తార్‌పూర్‌ కారిడర్‌ నిర్మాణానికి సహకరించిన ఇమ్రాన్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు.

You might also like