FbTelugu

ఆ నలుగురు ఎక్కడ?

Where-are-those-four

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ విజయారెడ్డి హత్య కేసులో కొత్త కోణాలు విచారణ క్రమంలో చిక్కుముడులుగా మారాయి. విజయారెడ్డి ఘటనా స్థలంలోనే మృతి చెందడం.. నిందితుడు సురేశ్ చికిత్స పొందుతూ చనిపోయిన విషయం తెలిసిందే. దీంతో ఆ రోజు ఎం జరిగిందనే అంశం విచారణలో కీలకంగా మారింది. అది తెలిస్తే కేసు కొలిక్కి వచ్చినట్లే అని పోలీసు అధికారులు భావిస్తున్నారు.

హత్య అనంతరం నలుగురితో మాట్లాడిన నిందితుడు..

తహసీల్దార్ పై పెట్రోల్ పోసి తగలపెట్టిన అనంతరం నిందితుడు కార్యాలయం నుంచి బయటకు వచ్చి బయట కారులో ఉన్న నలుగురితో మాట్లాడి వెళ్ళాడని తేలింది. ఆ నలుగురికి కేసుతో సంబంధం ఉందా.. లేక మంటలు అంటుకొని గాయాల పాలైన సురేశ్ తో ఏమైందో తెలుసుకునేందుకు మాట్లాడారా అన్నది తేలాల్సి ఉంది. వారికి తహసీల్దార్ హత్యకు ఎలాంటి సంబంధం లేకపోతే పోలీసులను కలిసి ఇప్పటికే వివరణ ఇవ్వాలి కదా అని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తన భర్త అమాయకుడని.. ఎవరో అతడిని కత్తిలాగా వాడుకొని హత్య చేయించారని నిందితుడి భార్య ఆవేదన వ్యక్తం చేయడం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తుంది.

You might also like