FbTelugu

ప్రభాస్-నాగ్ సినిమా ఎప్పుడు మొదలవుతుంది?

మహానటి చిత్రం ఫేమ్ దర్శకుడు నాగ్ అశ్విన్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కాంబినేషన్ సినిమా కోసం అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా ఎప్పుడు ప్రారంభిస్తారనే దానిపై ఎదురు చూస్తున్నారు.

వాస్తవానికి ఈ సినిమా తొలి షెడ్యూలు చిత్రీకరణను జూలై నెలలో మొదలు కావాల్సి ఉంది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా చిత్రీకరణ చేయలేని పరిస్థితులు నెలకొన్నాయి. తప్పని పరిస్థితుల్లో షూట్ ను అక్టోబర్ కు వాయిదా వేశారని టాలీవుడ్ లో టాక్ నడుస్తోంది. అయితే ఈ లోగా అవసరమైన ప్రీ ప్రొడక్షన్ పనులు, యాక్షన్ సీక్వెన్స్, టెక్నికల్ పనులపై దర్శకుడు దృష్టి పెట్టారు. ప్రస్తుతం ప్రభాస్ ఆదిపురుష్, రాధేశ్వామ్, సలార్ చిత్రాలలో బిజీగా ఉన్నారు. ఈ పరిస్థితులు ఒకసారి పరిగణనలోకి తీసుకుంటే వీరిద్దరి కాంబినేషన్ లోని చిత్రం వచ్చే ఏడాది రిలీజు అవుతుందనేది స్పష్టమవుతోంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.