FbTelugu

దర్శనం ఎప్పుడో చెప్పలేము: టీటీడీ ఛైర్మన్

తిరుపతి: శ్రీవారి దర్శనం ఎప్పుడు ప్రారంభమవుతుందో ఇప్పుడే చెప్పలేమమని టీటీడీ ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి తెలిపారు.

ఎల్లుండి నుంచి భక్తులకు కోరినన్ని లడ్డూలు విక్రయిస్తామని, ఏపీలోని టీటీడీ కళ్యాణ మండపాల్లో భక్తులకు అందుబాటులో ఉంటాయన్నారు. చిన్న లడ్డూలను రూ.50 నుంచి రూ.25 కు తగ్గించామన్నారు. శ్రీవారి దర్శనం తిరిగి ప్రారంభమయ్యేంత వరకు లడ్డూలు భక్తులకు అందుబాటులో ఉంటాయన్నారు.

ప్రతిరోజు 3 నుంచి 4లక్షల లడ్డూలను  తయారుచేస్తున్నామని చెప్పారు. అధిక లడ్డూలు కావాల్సిన వారు తిరుమల ఆలయ డిప్యూటీ ఇఓ 9849575952, పోటు పేష్కార్  9701092777 సంప్రదించవచ్చన్నారు. శ్రీవారి ఈ-హుండీ ద్వారా కానుకలు సమర్పించే భక్తులకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఈ-హుండీ ఆదాయం 2019 సంవత్సరంలో 1.79 కోట్లు కాగా 2020 సంవత్సరంలో 1.97 కోట్లు ఆదాయం వచ్చిందన్నారు.

భక్తులకు దర్శనం కల్పించలేకపోయినా ఈ-హుండీ ద్వారా భక్తులు కానుకలు సమర్పించుకుంటున్నారు. తిరుపతి కోవిడ్-19 ఆసుపత్రికి అవసరమైన మౌళిక వసతులకు టీటీడీ పూర్తి సహకారం అందిస్తుందని సుబ్బారెడ్డి హామీ ఇచ్చారు.

You might also like