FbTelugu

కేంద్రంపై కోర్టుకెక్కిన వాట్సప్?

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం సోషల్ మీడియాలో వార్తల షేరింగ్ పై నియంత్రణ విధించడాన్ని వ్యతిరేకిస్తూ వాట్సప్ సంస్థ ఢిల్లీ హైకోర్టును పిటీషన్ దాఖలు చేసింది. నూతన నిబంధనలు వినియోగదారుల గోప్యతకు భంగం కలిగించేలా ఉన్నాయని వాట్సప్ ఆరోపించింది.

ఈ విషయాన్ని రాయిటర్స్ సంస్థ తన కథనంలో వెల్లడించింది. సోషల్ మీడియా సంస్థలను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం నూతన నిబంధనలు ఈ ఏడాది ఫిబ్రవరిలో తీసుకువచ్చింది. అయితే వాట్సప్, ఫేస్ బుక్ సంస్థల వినతి మేరకు గడువును మే 26వ తేదీ వరకు పొడగించారు. ప్రతి సంస్థ ఫిర్యాదుల పరిష్కారం కోసం మూడంచెల వ్యవస్థను ఏర్పాటు చేయాలని, ఫిర్యాదుదారుడికి ఈ మెయిల్ ద్వారా సమాధానం పంపించాలని ఇలా పలు నిబంధనలు విధించింది. దేశ సార్వభౌమత్వానికి, రక్షణకు సంబంధించిన కీలకాంశాలకు సంబంధించిన ఏదైనా సమాచారాన్ని పెడితే వెల్లడించాలని స్పష్టం చేసింది. ప్రజల భద్రతకు ముప్పు కలిగేలా తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తే వాటి మూలాలను కూడా తెలియచేయాలని సూచించింది. ఈ నిబంధనలు సోషల్ మీడియా సంస్థలకు మింగుడుపడడం లేదు. ఈ నిబంధనలు వెంటనే పక్కన పెట్టేయాలని వాట్సప్ సంస్థ ఢిల్లీ హైకోర్టులో పిటీషన్ వేసింది. ఈ పిటీషన్ స్వీకరించిందా, ఎప్పుడు విచారిస్తుందనేది ఇంకా తెలియరావడం లేదు. బుధవారం నుంచి ఈ నిబంధనలు అమలులోకి వచ్చినందున సోషల్ మీడియా సంస్థలు అమలు చేయాల్సి ఉంటుంది. లేదంటే ఆ సంస్థలు క్రిమినల్ కేసుల, ఇతర కేసులను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఐటి నిపుణులు హెచ్చరిస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.