FbTelugu

ప్రైవసీ పాలసీపై వాట్సప్ బేఖాతర్

న్యూఢిల్లీ: ఎవరెన్ని అనుకుంటున్నా, భారత ప్రభుత్వంతో పాటు సుప్రీంకోర్టు నుంచి ఒత్తిళ్లు వచ్చినా ఇన్ స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సప్ మాత్రం తన పని తాను చేసుకుంటూ పోతున్నది. ప్రైవసీ పాలసీ (వ్యక్తిగత స్వేచ్ఛ) విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు.

దీని గురించి అందరికీ తెలియచేయడానికి ఇన్ యాప్ బ్యానర్ గా ఉంచాలని నిర్ణయించింది. అంటే మీ వాట్సప్ చాట్ పైన నూతన పాలసీకి సంబంధించిన లింక్ ఉంటుంది. తెలుసుకోవాలని అనుకునేవారు లింక్ ను క్లిక్ చేస్తే సమాచారం మొత్తం కన్పిస్తుంది. గందగోళం తెరదించడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని వాట్సప్ ప్రకటించింది. ప్రతి ఒక్కరు ప్రైవసీ పాలసీ అంగీకరించాల్సిందేనని వాట్సప్ స్పష్టం చేస్తోంది. మే 15వ తేదీ నుంచి అమలులోకి వస్తుందని పరోక్షంగా చెబుతున్నది. అంటే మీరు ఉంటే ఉండవచ్చు లేదా వేరే ప్రత్యామ్నాయం చూసుకోవచ్చని తేల్చింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.