FbTelugu

నకిలీ వార్తల కట్టడికి వాట్సప్ నెంబర్ 8799711259

కేంద్ర హోం శాఖ వెల్లడి
న్యూఢిల్లీ: దేశంలో సైబర్ కేటుగాళ్లు పలు నకిలీ వార్తలను వాట్సప్ లో షేర్ చేస్తూ లక్షలాది మంది ని బురిడీ కొట్టిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం పథకాలు ప్రవేశపెట్టిందని తప్పుడు వార్తలను ప్రాచుర్యంలోకి తెస్తున్నారు.

ఈ వార్తల పై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పిఐబి) ప్రతి రోజు ఖండిస్తూ ప్రకటనలు ఇచ్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ మధ్య కరోనాతో చనిపోయిన కుటుంబాలకు విపత్తుల నిర్వహణ చట్టం కింద రూ.4 లక్షలు చెల్లిస్తున్నారని, ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందంటూ ఏకంగా నకిలీ ఆదేశాలు, దరఖాస్తు ఫారాన్ని వాట్సప్ లో షేర్ చేశారు. ఇది నిజమే అనుకుని పలువురి తహసీల్దార్ కార్యాలయాలకు వెళ్లి ఆరా తీయగా అలాంటిదేమి లేదని మండల కార్యాలయం సిబ్బంది తిప్పి పంపించారు. ఇలా కరోనా మందులు, వ్యాక్సినేషన్, కరోనా మరణాలు, వైరస్ వ్యాప్తిపై తప్పుడు వార్తలు వెల్లువలా వస్తునే ఉన్నాయి. ఇలాంటి వాటిని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఏడాదిగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
ఇటువంటి అవాస్తవ, తప్పుడు, నకిలీ వార్తలు వాట్సప్ లో ఎవరైనా పంపినా, షేర్ చేసినా వెంటనే 8799711259 నెంబర్ కు వాట్సప్ చేయాలని కేంద్రం హోం శాఖ వెల్లడించింది. లేదా 2PIB Factcheck కి ట్విటర్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు.

You might also like

Leave A Reply

Your email address will not be published.