FbTelugu

వాట్సప్ కొత్త ఫీచర్ రాబోతున్నది…

వాట్సప్ ప్రజల జీవితాల్లో ఒక భాగమై పోయింది. ప్రతి నిత్యం కనీసం డజన్ సార్లు చూడకుండా ఉండలేని పరిస్థితి ఏర్పడింది. వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా ఎప్పటికప్పుడు సాంకేతికంగా అనేక మార్పులు చేస్తున్నారు.
అయితే వాట్సప్ మొబైల్ ఫోన్ లో ఇన్ స్టాల్ చేసుకున్న తరువాత యాక్టివేషన్ కోసం ఒటిపి అడుగుతుంది. వేగంగా ఓటిపి రాకపోవడం జరిగిన సందర్భంలో కాల్ ద్వారా ఓటిపి తీసుకుంటారు. అయితే రెండు ఆఫ్షన్ల వల్ల కొన్ని నష్టాలు ఉన్నాయి. మొబైల్ లో సిమ్ లేకపోయినా వాట్సప్ యాక్టివేట్ చేయవచ్చు. ఆ మొబైల్ కు వచ్చిన ఓటిపితో వేరే మొబైల్ లో యాక్టివేట్ చేసి లాగిన్ అవుతున్నారు. దీని వల్ల వినియోగదారులకు తలనొప్పులు వస్తుననాయి. దీనిపై ఫిర్యాదులు రావడంతో సాంకేతిక నిపుణులు దృష్టి సారించారు.

ప్రయోగ దశలో ఉన్న సాంకేతికత ప్రకారం వాట్సప్ లో లాగిన్ అవ్వడానికి మొబైల్ నెంబర్ ఇచ్చిన వెంటనే సదరు ఫోన్ కు కాల్ వస్తుంది. ఈ కాల్ ను ఎత్తాల్సిన అవసరం ఉండదు. కాల్ దానంతట అదే కనెక్టు అయి డిస్ కనెక్టు కూడా అవుతుంది. ఈ విధానంతో వాట్సప్ ఖాతా యాక్టివేట్ కావడంతో పాటు లాగిన్ అవుతుంది. దీన్నే ఫ్లాష్ కాల్ అంటారు. ప్రస్తుతం ఈ విధానం ట్రూ కాలర్ యాప్ కు అమలుపరుస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.