FbTelugu

తప్పుడు షేరింగ్ కు ‘వాట్సప్’ చెక్

ఢిల్లీ: పైసా ఖర్చు లేకుండా సమాచారం చేరవేసే అవకాశం ఉండడం, క్షణం తీరిక లేకుండా ఇష్టమైన వీడియోలను పంపించే వెసులుబాటు ఉండడంతో వాట్సప్ పెద్ద ఎత్తున దుర్వినియోగం అవుతోంది.

కుప్పలు తెప్పలుగా తప్పుడు సమాచారాన్ని పంపిస్తూ కులాలు, మతాలు, ప్రాంతాలు మధ్య భేధాభిప్రాయాలు తలెత్తేలా కుప్పలు తెప్పలుగా తప్పుడు సమాచారం పంపిస్తున్నారు. దీనిపై ప్రపంచ దేశాల్లో పెద్ద చర్చకే దారితీసింది. కొద్ది నెలలుగా వాట్సప్ మేనేజిమెంట్ పై ప్రభుత్వాలు, స్వచ్ఛంధ సంస్థలు ఒత్తిడి తేవడంతో పాటు న్యాయస్థానాలు ఆదేశాలు జారీ చేస్తున్న విషయం తెలిసిందే.

అయితే కొంత మేర అడ్డుకట్ట పడినప్పటికీ మళ్లీ అదే ఉధృతి కొనసాగుతున్నది. తప్పుడు సమాచారం అని తెలిసినా పనిగట్టుకుని ఇతరులకు పంపిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం దీన్ని నియంత్రించేందుకు వాట్సప్ కొత్త విధానాన్ని అమలు చేసింది. ఒక సందేశాన్ని ఐదుగురికి మించి పంపే అవకాశం లేకుండా చేసింది. ఐదుగురికి మాత్రమే షేర్ చేసే అవకాశం ఇచ్చినప్పటికీ ప్రయోజనం అంతగా లేదు.
తాజాగా మరో కొత్త ఫీచర్ ను ప్రవేశపెట్టి తప్పుడు వార్తల వ్యాప్తిని అడ్డుకునేందుకు సిద్ధమైంది. సమాచారం నిజమా, అబద్దమా అనేది కనిపెట్టించి ఎక్కువ మందికి షేర్ కాకుండా అడ్డుకునే ప్రయత్నాలు వినియోగదారుల చేతుల్లోనే పెట్టనున్నది. చెక్ చేసేందుకు మెస్సేజీ పక్కనే కొత్తగా బ్రౌజర్ ఫీచర్ సౌకర్యం కల్పించారు. బ్రౌజర్ ఫీచర్ ద్వారా నిజమా, అబద్దమా అనేది తేలిపోతుంది. నిజమైతే షేర్ చేయవచ్చు. అబద్దమైతే ఆపివేయవచ్చు.

You might also like