FbTelugu

త్వరలో వాట్సప్ 12 కొత్త ఫీచర్లు

ముంబై: వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా వాట్సప్ కొత్త కొత్త ఫీచర్లు ప్రవేశపెడుతున్న విషయం తెలిసిందే. తాజాగా డిసప్పయిరింగ్ ఫీచర్ ను ప్రారంభించింది. మున్ముందు మరో 12 కొత్త ఫీచర్లు ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది

ప్రస్తుతం 12 కొత్త ఫీచర్లు అభివృద్ధి దశలో ఉన్నాయి. తమకు వచ్చిన మెస్సేజీలను తదుపరి కాలంలో చదివేందుకు వీలుగా రీడ్ లేటర్ ఫీచర్ ను పరీక్షిస్తున్నారు. ఆర్కీవుడు చాట్స్ ఫీచర్స్ పరిధిలో ఉంది. దీన్ని మరింత ఆధునీకరించింది. ఈ ఫీచర్ ను ఆన్ చేస్తే ఆర్కీవ్ చేసిన చాట్ నుంచి కాల్స్, మెస్సేజీలు అందుకునే అవకాశం ఉండదు. రీడ్ లేటర్ ఆన్ చేస్తే దానికి సంబంధించి నోటిఫికేషన్లు వెలువడవు. వెకేషన్ మోడ్ పైనా కూడా కసరత్తు చేస్తున్నారు. బ్లాక్ చేసినప్పటికీ చెక్ పెట్టలేకపోతున్నాము. ఇందుకోసం రిపోర్టు టు వాట్సప్ ఫీచర్ రాబోతున్నది.

వాట్సప్ ఒకే అక్కౌంట్ నుంచి నాలుగు డివైస్ లలో వాట్సప్ వినియోగించేందుకు వీలు కల్పించే సన్నాహాలు చేస్తున్నారు. ఇదే కాకుండా అడ్వాన్స్ డు వాల్ పేపర్ ఫీచర్ ను ఒక్కో కాంటాక్టుకు ఒక్కో వాల్ పేపర్ ను పెట్టకునేందుకు ప్రయోగాలు జరుగుతున్నాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.