FbTelugu

మ‌త్తు వైద్యుడి చుట్టూ ఏం జ‌రుగుతోంది?

న‌ర్సీపట్నం అన‌స్తీషియా వైద్యుడు డాక్ట‌ర్ సుధాక‌ర్ చుట్టూ ఏం జ‌రుగుతుంది. ప్ర‌భుత్వం ఆయ‌న‌కు పిచ్చి అనే ముద్ర వేసేందుకు ప్ర‌య‌త్నిస్తుందా! ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శించినందుకు త‌గిన‌మూల్యం త‌ప్ప‌ద‌ని శిక్ష విధిస్తుందా! సుప్రీంకోర్టులో కేసు విచార‌ణ‌కు వ‌చ్చేంత వ‌ర‌కూ ఇదే వైద్యం అందిస్తారా! త‌న‌ను సైకోగా మార్చేందుకు విశాఖ‌లోని మాన‌సిక వైద్యులు మందులు ఇస్తున్నారంటున్న డాక్ట‌ర్ సుధాక‌ర్ మాటల్లో నిజ‌మెంత‌.

విశాఖ‌ప‌ట్ట‌ణంలోని మాన‌సిక వైద్య‌శాల సూప‌రింటిండెంట్ రాధారాణికి త‌న‌కు అందిస్తున్న వైద్య‌చికిత్స‌పై డాక్ట‌ర్ సుదాక‌ర్ నాలుగు పేజీల లేఖ రాశారు. త‌న‌ను అనారోగ్యానికి గురిచేసే మందులు ఇస్తున్నారంటూ చెప్పాడు. త‌న‌పై క‌క్ష‌సాధింపులో భాగంగానే ఇదంతా చేస్తున్నారంటూ ఆవేద‌న వెలిబుచ్చారు. డాక్ట‌ర్ త‌ల్లి కావేరి బాయి కూడా దీనిపై ఆందోళ‌న వెలిబుచ్చారు. న‌ర్సీపట్నం ప్ర‌భుత్వ వైద్య‌శాల‌లో అన‌స్తీషియా వైద్యుడుగా సుధాక‌ర్ ప‌నిచేస్తున్నారు. క‌రోనా సమ‌యంలో ఎన్‌95 మాస్క్‌లు ఇవ్వ‌ట్లేదంటూ ఆరోప‌ణ‌లు చేశాడు. దీనిపై ఉన్న‌తాధికారుల‌ను సంప్ర‌దించినా ప్ర‌యోజ‌నం లేకపోవ‌టంతో త‌న బాధ‌ను వీడియో రూపంలో బ‌య‌ట‌కు చెప్పారు. ఇది ప్ర‌భుత్వ వ్య‌తిరేక చ‌ర్య‌గా ఆయ‌న్ను స‌స్పెండ్ చేశారు.

అనంత‌రం ఆయ‌న‌ను అరెస్టు చేయ‌టం.. మాన‌సిక స్థితి స‌రిగాలేదంటూ ఆసుప‌త్రికి త‌రించ‌టం జ‌రిగిపోయాయి. కానీ.. ఇదంతా ప్ర‌భుత్వ కుట్ర‌గా హైకోర్టుకు వెళ్లారు డాక్ట‌ర్ కుటుంబ స‌భ్యులు. హైకోర్టు ఆదేశాల‌తో జిల్లా న్యాయ‌మూర్తి విచార‌ణ చేశారు. డాక్ట‌ర్ ఇచ్చిన వాంగ్మూలం, ఆయ‌న శ‌రీరంపై ఉన్న గాయాల నివేదిక‌ను హైకోర్టుకు ఇచ్చారు. దీన్ని తీవ్రంగా ప‌రిగ‌ణించిన హైకోర్టు డాక్ట‌రు సుధాక‌ర్ కేసు విచార‌ణ‌ను సీబీఐకు అప్ప‌గించింది. అయితే దీనిపై ఏపీ స‌ర్కారు సుప్రీంకోర్టుకెళ్లింది. ఈ నేప‌థ్యంలోనే డాక్ట‌ర్ సుధాక‌ర్ త‌న‌కు వివిధ ర‌కాల మ‌త్తుమందులు ఇస్తూ.. త‌న‌ను మాన‌సిక రోగిగా మార్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. మ‌రి సుప్రీంకోర్టులో కేసు విచార‌ణ జ‌రిగేనాటికి ప‌రిస్థితులు ఎలా మార‌తాయ‌నేది మాత్రం ఆందోళ‌న క‌లిగిస్తుంది.

You might also like