FbTelugu

షూటింగ్‌ల‌పై ఏం చేద్దాం..!

వేలాది మంది ఆశ‌లు… ల‌క్ష‌లాది మంది కార్మికులు.. కోట్లాదిరూపాయ‌ల ఆదాయం. ఇవ‌న్నీ సినిమా చుట్టూ తిరుగుతుంటాయి.

టాలీవుడ్‌, బాలీవుడ్‌, శాండిల్‌వుడ్‌, హాలీవుడ్ ఏ వుడ్ అయినా కోట్లాదిమందికి జీవ‌నోపాధి చూపుతు ఫుడ్ పెడుతోంది. తెలుగు నాట 25,000 కుటుంబాలు సినిమాల‌ను న‌మ్ముకున్నాయి. మ‌రో రెండు ల‌క్ష‌ల కుటుంబాల‌కు ఇదే ఆధారం. మ‌రి రెండు నెల‌లుగా షూటింగ్‌లు లేవు.

చిరంజీవి ఏర్పాటు చేసిన ట్ర‌స్ట్ ద్వారా 20,000 కుటుంబాల క‌డుపునిండుతుంది. మ‌రి మ‌రో రెండునెల‌ల‌కు ఏం చేయాలి. ఇన్ని వేల మందికి ఎవ‌రు తిండి పెడ‌తార‌నేది పేద్ద సందేహం. అందుకే.. దీనిపై ప్ర‌భుత్వం కూడా సానుకూలంగా నిర్ణ‌యం తీసుకోవాల‌నుకుంటుంద‌ట‌.

సినిమా షూటింగ్‌ల‌కు నిబంధ‌న‌ల‌తో కూడిన అనుమ‌తి ఇవ్వాల‌ని యోచిస్తుంద‌ట‌. దీనిపై సినీపెద్ద‌ల‌తోనూ ప్ర‌భుత్వం చ‌ర్చించిన‌ట్టు తెలుస్తోంది. అదే జ‌రిగితే.. షూటింగ్‌లు మొద‌ల‌వుతాయి. భారీ బ‌డ్జెట్‌తో నిర్మించిన సినిమాలు వీలైంన‌త త్వ‌ర‌గా విడుద‌ల కావ‌చ్చు. అభిమానుల‌కే క‌నుల పండువ‌గానే గాకుండా.. వేలాది కుటుంబాల క‌డుపు నిండుతుంది. మ‌రి.. క్లాప్ ఎప్పుడు కొడ‌తారో.. ఆగిన ప్రాజెక్టులు ఎప్పుడు ప‌ట్టాలెక్కుతాయ‌నేది కొద్దిరోజుల్లో తేల‌నుంద‌ట‌. ఈ మేర‌కు తెలంగాణ‌, ఏపీ ప్ర‌భుత్వాలు మార్గ‌ద‌ర్శ‌కాలు సిద్ధం చేస్తున్నాయ‌ని స‌మాచారం.

You might also like