FbTelugu

ఇండియా ఏ స్థాయికి చేరిందంటే..

ఇండియా పరిస్థితి దారుణంగా తయారైంది. కరోనా కట్టడిలో ముందువరుసలో ఉన్న ఇండియా ఇప్పుడు కరోనా విలయతాండవంలో కూడా ముందు వరుసలోనే నిలిచింది. మొదటి వేవ్‌లో కేంద్రం, రాష్ట్రాలు వెంటనే స్పందించడంతో కరోనా నష్టాన్ని చాలావరకు తగ్గింది. కరోనా కట్టడిలో ఇండియా తీసుకుంటున్న చర్యలను ప్రపంచ దేశాలు కూడా కొనియాడాయి.

కొన్ని దేశాలు ఇండియాలు చేపట్టిన కార్యక్రమాలను అక్కడ కూడా అమలు చేశాయి. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. ఒకప్పుడు ఇండియా అంటే ఆహా.. ఓహో అన్న దేశాలే ఇప్పుడు వామ్మో ఇండియా అంటున్నాయి. కరోనా సెకండ్‌ వేవ్‌ ఇండియాను అతలాకుతలం చేస్తోంది. ప్రతిరోజూ నాలుగు లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. నాలుగు వేల మందికి పైగా మరణిస్తున్నారు. వాస్తవానికి ఈ లెక్కలు కూడా సరికాదని, ప్రభుత్వాలు కావాలని కేసులను తక్కువ చేసి చూపిస్తున్నారన్న ప్రచారం సాగుతోంది. ఈ విషయం కేంద్రం విడుదల చేసిన డేటాతోనే బయట పడింది. కేంద్రమంత్రి హర్షవర్దన్‌ వెల్లడించిన లెక్కల ప్రకారం దేశంలో కేవలం ఆక్సిజన్‌ బెడ్‌పైనే 15.62 మంది ఉన్నారు. మొత్తం కరోనా కేసుల్లో 5.43శాతం మంది ఆక్సిజన్‌ బెడ్‌పై ఉన్నారని చెప్పారు. ఆ లెక్క ప్రకారం చూసుకుంటే దేశంలో దేశవ్యాప్తంగా 3.12 కోట్ల కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నట్టు. కానీ, అధికారులు ఇంకా తక్కువగా లెక్కలు చూపుతున్నారు. దేశంలో కరోనా ఎంత తీవ్రంగా ఉందో అనేక సంస్థలు వెల్లడిస్తున్నాయి. ప్రపంచ దేశాలు, ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఇండియాలో ప్రమాదం మరింత ముంచుకొస్తుందని నెత్తీనోరు బాదుకుంటోంది. అయినా, ఇక్కడ కేంద్రం మాత్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. లాక్‌డౌన్‌ రాష్ట్రాల ఇష్టానుసారం చేసుకోవచ్చు అని బాధ్యతల నుంచి తప్పించుకుంటోంది. దీంతో ప్రమాదం మరింతగా ముంచుకొస్తోంది. ఒకప్పుడు కరోనా తీవ్రంగా ఉన్న దేశాల నుంచి ఎవరినీ ఇండియాకు రాకుండా అడ్డుకున్న దేశం తన పరిస్థితి నుంచి మరింతగా దిగజారింది.

ప్రపంచ దేశాలు ఇప్పుడు ఇండియా అంటే అమ్మో అని భయపడుతున్నారు. భారత్‌ నుంచి రాకపోకలను నిలిపివేశారు. దేశ చరిత్రలో తొలిసారిగా ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆ దేశస్తులు ఎవరైనా ఇప్పుడు ఆస్ట్రేలియాకు వస్తే ఐదు సంవత్సరాల జైలుశిక్ష విధిస్తామని నిర్ణయించింది. ఇండియాలో కరోనా విలయ తాండవం చేస్తున్నందున తమ దేశ పౌరులెవరూ స్వదేశానికి రావద్దని తేల్చి చెప్పింది. అమెరికా కూడా ఇండియా నుంచి వచ్చేవారిని అనుమతించేది లేదని ఆంక్షలు విధించింది. ఇంకా అనేక దేశాలు ఇదే పద్ధతిని ఆచరిస్తున్నాయి. ఒకప్పుడు కరోనా విలయ తాండవం చేస్తుందని మనం దూరం పెట్టిన దేశాలు ఇప్పుడు మనలను కూడా దూరం పెట్టే స్థాయికి మనం దిగజారాల్సిన పరిస్థితి వచ్చిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇంత జరుగుతున్నా పాలకుల్లో చలనం రావడం లేదని దేశ పౌరులు నెత్తీనోరు బాదుకుంటున్నారు. ఇకనైనా ప్రభుత్వాలు మేలుకుంటాయేమోనన్న ఆశతో భారత ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.