FbTelugu

భార‌త్ బ‌యోటెక్ తో బాబుకు సంబంధం ఏమిటీ!

ఈ మ‌ధ్య ఒక ప‌త్రిక‌లో చంద్రబాబును ఎద్దేవా చేస్తూ ఓ వార్త ప్ర‌చురిత‌మైంది. వాళ్లు వ్యంగ్యంగా భార‌త్ బ‌యోటెక్ నా వ‌ల్ల‌నే వ‌చ్చింది. వ్యాక్సిన్ కూ నేనే కార‌ణ‌మంటూ మాజీ సీఎం చంద్ర‌బాబు నాయుడు అన్న‌ట్టుగా రాశారు.

వాస్త‌వానికి చంద్ర‌బాబు చెప్పిన మాట అది కాదు. భార‌త్ బ‌యోటెక్ నా హ‌యాంలోనే ఏర్ప‌డిందంటూ గుర్తు చేశారు. దీన్ని ప్ర‌త్య‌ర్థులు ఆయ‌న్ను చుల‌క‌న చేసేలా స్పందించ‌టంతో చాలా మంది అదే అపోహ‌లో ఉన్నారు. ఐటీ, ఫార్మా రంగాల‌కు చంద్ర‌బాబు బాట‌లు వేస్తే.. వైఎస్.రాజ‌శేఖ‌ర్‌రెడ్డి దాన్ని కొన‌సాగించాననట‌ంలో అతిశ‌యోక్తి కాదు. ఇప్పుడు టీఆర్ఎస్ ప్ర‌భుత్వం.. ఆ రెండు రంగాల‌కూ మ‌రింత‌గా ప్రాధాన్య‌త‌నిస్తుంది.

ఏ మాట‌కు ఆ మాటే చెప్పుకోవాలి. ఇప్పుడు కోవాగ్జిన్ పేరుతో క‌రోనా వ్యాక్సిన్ సిద్ద‌మ‌వుతుంది. పంద్రాగ‌స్టుకు దాన్ని విడుద‌ల చేయాల‌ని భార‌త ప్ర‌భుత్వం గ‌ట్టిగా నిర్ణ‌యం తీసుకుంది. దీనిపై మిశ్ర‌మ స్పంద‌న వ‌స్తున్నా ప‌రిశోధ‌కులు మాత్రం భార‌త్ బ‌యోటెక్‌ను అభినందిస్తున్నారు. హైద‌రాబాద్‌లోని జినోమ్ వ్యాలీలో పురుడు పోసుకున్న భార‌త్‌ బ‌యోటెక్ ఆవిర్భావానికి ఆనాటి చంద్ర‌బాబు నాయుడుకార‌ణం.. ఇది ఎవ‌రో అన్న‌ మాట కాదు. స్వ‌యంగా తెలంగాణ ఐటీ మంత్రి హోదాలో గ‌తేడాది కేటీఆర్ చెప్పిన మాట‌లు. కాంగ్రెస్‌ను ఉద్దేశించి చేసిన ఘాటు కామెంట్స్‌.

ఇప్పుడు అదే ప‌రిశోధ‌న సంస్థ భార‌త ప‌రిశోధ‌న మండ‌లి(ఐసీఎంఆర్‌)తో క‌ల‌సి క‌రోనా విరుగుడు టీకా క‌నిపెట్ట‌బోతుంది. ఈ మేర‌కు ఆల్రెడీ జంతువుల‌పై ఔష‌ధ ప్ర‌యోగం చేసి అనుకున్న ఫ‌లితాలు సాధించారు. ఇప్పుడు ఈ వ్యాక్సిన్‌ను మ‌నుషుల‌పై ప్ర‌యోగించేందుకు హైద‌రాబాద్‌లోని నిజామ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ‌(నిమ్స్‌) రెడీ అయింది. ప‌దిమంది వైద్యుల బృందంతో ప్ర‌త్యేకంగా ఐసీయూ వార్డు కూడా ఏర్పాటు చేశారు. అంత‌ర్జాతీయంగా 100కు పైగా సంస్థ‌లు వ్యాక్సిన్ ‌త‌యారీలో నిమ‌గ్న‌మ‌య్యాయి.

కొన్ని తాము స‌క్సెస్ అయ్యామంటున్నా.. ఎలా అయ్యార‌నేది చెప్ప‌లేక‌పోతున్నారు. కొవాగ్జిన్ వ్యాక్సిన్ త‌యారీలో ఐసీఎంఆర్ ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకుంది. అందుకేనేమో.. భార‌త్ ‌బ‌యోటెక్‌కు పూర్తిస్తాయి తోడ్పాటును అందించింది. జులై 7 నుంచి అంటే.. మంగ‌ళ‌వారం నుంచి నిమ్స్‌లో క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ ‌ప్రారంభం కాబోతున్నాయి. దీనికోసం 30-60 ఏళ్ల మ‌ధ్య వ‌య‌సు గ‌ల 60 మందిని ఎంపిక చేశారు. వీరికి ముందుగానే వైద్య‌ప‌రీక్ష‌లు చేస్తారు. వారిలో ఫిట్‌గా ఉన్న‌వారికి భార‌త్ బ‌యోటెక్ పంపిన మూడు ర‌కాల వ్యాక్సిన్‌ల‌లో ఒక‌టి ఇస్తారు.

రెండ్రోజులు ఆసుప‌త్రిలోనే ఉంచుతారు. వారికి ఎటువంటి ఇబ్బంది లేద‌ని నిర్ణ‌యించాక‌.. ఇంటికి పంపుతారు. 14 రోజుల పాటు వారి ఆరోగ్యంలో చోట‌చేసుకుంటున్న మార్పుల‌ను గ‌మ‌నిస్తూ అంచ‌నా వేస్తారు వైద్యులు. తిరిగి 14 రోజుల త‌రువాత వారికి గ‌తంలో ఇచ్చిన వ్యాక్సిన్ డోస్‌ను ఇస్తారు. 28 రోజుల పాటు సాగే క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ ప్ర‌క్రియ‌లో మ‌నుషుల్లో వ‌చ్చిన మార్పులు.. వారి ఆరోగ్యం. క‌రోనా వైర‌స్‌ను త‌ట్టుకునేందుకు అనువుగా త‌యారైన యాంటీబాడీస్ త‌దిత‌ర వివ‌రాల‌ను సేక‌రిస్తారు. ఇవ‌న్నీ స‌క్ర‌మంగా ఉన్న‌ట్టు పూర్తిస్తాయిలో వైద్య‌నిపుణులు నిర్ధ‌రించాక దాన్ని ఎవ‌రికి ఇవ్వాల‌నేది ప్ర‌భుత్వ నిర్ణ‌యం.

ఫేజ్‌01, ఫేజ్‌02 ల్లో జ‌రిగే క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్‌లో కొవాగ్జిన్ మూడు ర‌కాల్లో ఇలా ఉంటుంది. మొద‌టిది 3 మైక్రోగ్రామ్స్‌, రెండోది 6 మైక్రోగ్రామ్స్‌, మూడోవ‌ది ప్లాసిగో.. ఈ మూడు డోసుల‌ను.. ఆయా వ్య‌క్తుల ఆరోగ్య ప‌రిస్థితి.. శ‌రీర త‌త్వాన్ని బ‌ట్టి ఇస్తార‌ని వైద్య‌నిపుణులు చెబుతున్నారు. ఇప్ప‌టికే చైనా ఇదే త‌ర‌హాలో త‌యారుచేసిన వ్యాక్సిన్‌ను త‌మ సైన్యానికి అందిస్తుందంటూ ఇటీవ‌ల ఓ టీవీ ఇంట‌ర్వ్యూలో భార‌త్ బ‌యోటెక్ ఛైర్మ‌న్ ఎల్లా కృష్ణ గుర్తు చేశారు. కొవాగ్జిన్ క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ పూర్త‌య్యాక‌.. దాన్ని ముందుగా ఎవ‌రికి ఇవ్వాల‌నేది ప్ర‌భుత్వం తీసుకునే నిర్ణ‌యం ఆధారంగా ఉంటుంద‌టూ తేల్చిచెప్పారు. ఇంత‌టి ప్రాజెక్టును చేప‌ట్టిన భార‌త్ ‌బయోటెక్ తెలుగు వ్య‌క్తిది అయితే.. దాని ఏర్పాటుకు చంద్ర‌బాబు కార‌ణం కావ‌ట‌మే ఇక్క‌డ చెప్పుకోగ‌దిన అంశం.

You might also like

Leave A Reply

Your email address will not be published.