FbTelugu

ప్రైవేటులో వ్యాక్సిన్ డోస్ ధర ఎంతంటే?

న్యూఢిల్లీ: గత కొద్ది రోజులుగా ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో మాత్రమే ఫ్రంట్ లైన్ వారియర్స్ కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతోంది. ప్రస్తుతం కొన్ని రాష్ట్రాలలో పోలీసులకు కూడా ఇస్తున్నారు. ఈ కార్యక్రమం ఉచితంగానే జరుగుతోంది.

ప్రైవేటు ఆసుపత్రులలో కూడా వ్యాక్సిన్ ను వినియోగం లోకి తేవాలని కేంద్రం నిర్ణయించింది. వ్యాక్సిన్ ఒక డోస్ ధర రూ.150 గా ఖరారు చేశారు. దీనికి అదనంగా రూ.100 సర్వీసు ఛార్జి విధిస్తారు. ఈ మొత్తాన్ని మాత్రం ఆసుపత్రులకు చెల్లించాల్సి ఉంటుంది. మర్చి 1వ తేదీ నుంచి సీనియర్ సిటిజన్లు, 45 ఏళ్లకు పైబడి ఒకటి రెండు జబ్బులతో ఉన్నవారికి కరోనా వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. ఈ ధరలను జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్.హెచ్.ఎం) ఖరారు చేసి రాష్ట్రాల పరిశీలనకు పంపించింది. రాష్ట్రాల అభిప్రాయం తీసుకుని ఒకటి రెండు రోజుల్లో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేయనున్నది.

You might also like

Leave A Reply

Your email address will not be published.