FbTelugu

అసలు మోదీ విదేశీ విధానం ఏంటీ ?: ఓవైసీ

హైదరాబాద్: ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ప్రధాని మోదీపై తీవ్రంగా విమర్శలు కురిపించారు. చిరకాల మిత్రదేశమైన నేపాల్ కూడా ప్రస్తుతం భారత్ భూభాగాన్ని ఆక్రమించిందని అసలు మోదీ విదేశీ విధానం ఏంటని ప్రశ్నించారు.

భారత్ లో కరోనా ఇటలీ, చైనా కరోనా వైరస్ ల కంటే ప్రమాదకరమని నేపాల్ ప్రధాని ఓలీ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. ప్రధాని మాట్లాడే 56 అంగుళాల ధైర్యం ఎక్కడ ఉందని ప్రశ్నించారు. చైనా గతంలో నిరంతరం భారత భూభాగంలో అతిక్రమణలు చేసిందని, ఇప్పుడు నేపాల్ కూడా మనకు సమస్యలను సృష్టిస్తోందన్నారు. ఈ చర్యలపై మోడీ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.

You might also like