FbTelugu

విశాఖలో కృష్ణాబోర్డు ఏంటీ ? : మంత్రి నిరంజన్ రెడ్డి

* కృష్ణా బోర్డును తమ కంట్రోల్ లో ఉంచుకునే యత్నమే
హైదరాబాద్: కృష్ణా బోర్డును విశాఖలో పెట్టడం ఏంటని తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కృష్ణా బోర్డును విశాఖకు తరలించడాన్ని తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు.

తెలంగాణ ప్రజలు, అధికారులు కృష్ణా బోర్డును కలవాలంటే ఎక్కడో ఉన్న విశాఖకు వెళ్లాలని అన్నారు. కృష్ణా పరివాహక ప్రాంతానికి విశాఖ వందల కిలోమీటర్ల దూరంలో ఉందని అన్నారు. ఇది కృష్ణా బోర్డును తమ కంట్రోల్ లో ఉంచుకునే యత్నమేనన్నారు. 20 ఏండ్ల క్రితం మొదలు పెట్టిన కుట్ర ఫలితమే రాయలసీమ లిఫ్ట్ అని అన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.