FbTelugu

పాస్ పోర్టులతో రాష్ట్రానికి ఏం సంబంధం: ఎమ్మెల్యే షకీల్

నిజామాబాద్: నకిలీ పాస్ పోర్టుల జారీలో తెలంగాణ ప్రభుత్వాని ఏలాంటి సంబంధం లేదని, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అనవసర ఆరోపణలు చేస్తున్నారని బోధన్ ఎమ్మెల్యే షకీల్ ఖండించారు.

ఇవాళ బోధన్ లో షకీల్ మీడియాతో మాట్లాడుతూ బోధన్ రోహింగ్యాలు లేనే లేరని సవాల్ చేశారు. బోధన్ లో ఒకే ఇంటి నుంచి జారీ అయిన నకిలీ పాస్ పోర్టులపై ఎంపీ అరవింద్ లేనిపోని ఆరోపణలు చేస్తూ రాజకీయం చేస్తున్నారని ఆయన అన్నారు. పాస్ పోర్టులను కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని విదేశీ మంత్రిత్వ శాఖ జారీ చేస్తుందన్నారు. అసలు పాస్ పోర్టుల జారీతో రాష్ట్రానికి ఎలాంటి సంబంధం లేదని ఆయన కొట్టిపారేశారు.
ఒకే ఇంటి నుంచి 32 పాస్ పోర్టులు రోహింగ్యాలు పొందితే కేంద్రం ఏం చేస్తున్నదని ఆయన నిలదీశారు. వేరే రాష్ట్రాల నుంచి ఆధార్ కార్డులు తీసుకుని, ఇక్కడ పోస్ పోర్టులు పొందారన్నారు. తెలంగాణలో ఆధార్ కార్డులు తీసుకోలేని స్పష్టం చేశారు. ఎంపీ అరవింద్ ఇప్పటికైనా మతాల మధ్య చిచ్చుపెట్టే విమర్శలు మానుకుని జిల్లా అభివృద్ధిపై దృష్టి సారించాలని ఎమ్మెల్యే షకీల్ హితవు పలికారు. అరవింద్ వచ్చే ఎన్నికల్లో మళ్లీ విజయం సాధిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని అన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.