FbTelugu

జగన్ కేసుతో రఘురామకు ఏం సంబంధం?

సిబిఐ ప్రత్యేక కోర్టులో జగన్ కౌంటర్ దాఖలు

హైదరాబాద్: ఏపి సిఎం వైఎస్.జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులతో ఎంపి కె.రఘురామ కృష్ణమ రాజుకు ఏంటి సంబంధం అని ఆయన తరుఫు న్యాయవాదులు సిబిఐ ప్రత్యేక కోర్టులో కౌంటర్ దాఖలు చేశారు.

ఇలాంటి కేసుల్లో థర్డ్ పార్టీ జోక్యం చేసుకోవద్దని సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయని జగన్ తరఫు న్యాయవాదులు గుర్తు చేశారు. సిఎం వైఎస్.జగన్ బెయిల్ రద్దు పిటీషన్ పై ఇవాళ సిబిఐ ప్రత్యేక కోర్టులో విచారణ జరిగింది. జగన్ తరఫు న్యాయవాదులు 98 పేజీల కౌంటర్ దాఖలు చేసి, బెయిల్ షరతులను జగన్ ఎక్కడా ఉల్లంఘించలేదన్నారు. సిబిఐ విభాగం కేంద్ర హోం శాఖ పరిధిలో పనిచేస్తున్నదని, అసలు ఈ కేసుతో రఘురామ కృష్ణమరాజుకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. ఆయన పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డంతో అనర్హుడిగా ప్రకటించాలని లోకసభ స్పీకర్ కు వైసిపి అధినాయకత్వం లేఖ కూడా పంపించిందన్నారు. ఆయన పై ఏపిలో లెక్కలేనన్ని కేసులు ఉణ్నాయని, బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టిన కేసులో సిబిఐ కేసు కూడా పెట్టిందన్నారు. వ్యక్తిగత, స్వార్థ ప్రయోజనాల కోసం సిబిఐ ప్రత్యేక కోర్టును వినియోగించుకోవాలని చూస్తున్నారని జగన్ తరఫు న్యాయవాదులు తెలిపారు. కౌంటర్ పరిశీలించిన సిబిఐ ప్రత్యేక కోర్టు జడ్జి తదుపరి విచారణ ఈ నెల 14కు వాయిదా వేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.