FbTelugu

రజినీకాంత్ ఆరోగ్యానికి ఏమైంది?

చెన్నై: సూపర్ స్టార్ రజినీకాంత్ ఈ మధ్య తరచూ అనారోగ్యానికి గురవుతున్నారు. అకస్మాత్తుగా ప్రత్యేక విమానంలో అమెరికా కు వెళ్లిపోవడంతో అభిమానులు కలత చెందుతున్నారు.
ఆయన ఆరోగ్యానికి ఏమైందోనన్న బెంగ అభిమానులను పట్టిపీడిస్తున్నది. కరోనా సెకండ్ వేవ్ ఉధృతి కారణంగా భారత ప్రభుత్వం విమాన రాకపోకలపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే.

రజినీకాంత్ వినతి మేరకు కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ ప్రత్యేక అనుమతులు మంజూరు చేసింది. వైద్య పరీక్షల కోసం అమెరికా వెళ్తున్నట్లు ఆయన ప్రభుత్వానికి తెలిపారు. 14 సీట్ల సామర్థ్యం కల విమానంలో కుటుంబ సభ్యులతో కలిసి ఆయన యుఎస్ వెళ్లారు. ది గ్రే మ్యాన్ షూటింగ్ కోసం రజినీకాంత్ అల్లుడు ధనుష్, కుమార్తె ఐశ్వర్య యుఎస్ లోనే ఉన్నారు. గతేడాది డిసెంబర్ 24న బిపి సమస్య రావడంతో ఆయనను హుటాహుటిన జూబ్లిహిల్స్ అపోలో హాస్పిటల్ లో చేర్పించారు. అన్నత్తే షూటింగ్ కోసం హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీ వచ్చారు. అపోలో లో చికిత్స తీసుకున్న తరువాత ప్రత్యేక విమానంలో తిరిగి చెన్నై వెళ్లిపోయారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.