FbTelugu

కరోనాపై చైనా బుకాయింపు నిజమే

తేల్చిన మిలిటరీ గేమ్స్ అథ్లెట్స్

బీజింగ్: గతేడాది అక్టోబర్ నెలలోనే చైనాలో కరోనా వైరస్ ఉధృతి ఉందని అథ్లెట్లు బట్టబయలు చేయడం సంచలనం సృష్టిస్తోంది.

అయితే ఇప్పుడు కూడా చైనా డిసెంబర్ నెలలోనే వైరస్ పుట్టిందని చెబుతున్నది కాని, ఎక్కడ పుట్టిందనే విషయాన్ని మాత్రం ప్రపంచానికి చెప్పలేకపోతున్నది. చైనాకు వ్యతిరేకంగా 62 దేశాలు ఏకమై, విచారణ జరపాల్సిందేనని పట్టుబడుతున్నాయి. అంతర్జాతీయ న్యాయస్థానానికి ఈడ్చేందుకు సన్నద్ధమవుతున్నాయి.

ఈ తరుణంలో అథ్లెట్లు వెల్లడించిన విషయాలు చర్చనీయాంశంగా మారాయి. కరోనా వైరస్ కు జన్మస్థానం అయిన ఊహాన్ లో 2019, అక్టోబర్ నెలలో ప్రపంచ స్థాయి మిలిటరీ క్రీడలు నిర్వహించారు. ఈ క్రీడలకు 100 దేశాలకు చెందిన పదివేల మంది క్రీడాకారులు పాల్గొన్నారు.

అయితే వీరిలో చాలా మంది అస్వస్థతకు గురికకావడం, ఆసుపత్రుల పాలు కావడం జరిగింది. ఆ తరువాత కొందరికి పాజిటివ్ గా తేలింది. ఫ్రెంచ్ పెంటాథ్లెట్ ఎలోడి క్లౌవెట్, ఆమె భాగస్వామి వాలంటీన్ బిలౌడ్ మిలిటరీ క్రీడల సమయంలోనే వైరస్ బారిన పడ్డారు.

అదే విధంగా తన అపార్ట్ మెంట్ లో ఉణ్న వారందరూ అనారోగ్యం పాలయ్యారని ఇటలీ ఫెన్సర్ తగ్లియారియోల్ వెల్లడించాడు. అయితే ఆ వ్యాధి లక్షణాలు కరోనాను పోలినట్లు ఉన్నాయని ఇప్పుడు అర్థమవుతోందన్నారు. తన నుంచి తన గర్ల్ ఫ్రెండ్, కుమారుడికి వైరస్ సోకిందని ఆవేదన వ్యక్తం చేశాడు.

ఆ సమయంలోనే తనకు, తన సహోద్యోగికి కరోనా సోకిందని జర్మనీ వాలీబాల్ క్రీడాకారుడు జాక్వెలిన్ బట్టబయలు చేసింది. నేను అక్కడి నుంచి స్వదేశానికి వచ్చిన తరువాత తన తండ్రి అనోరోగ్యం బారిన పడ్డారన్నారు. ఇప్పుడు అనిపిస్తున్నది ఏమంటే అవి కరోనా లక్షణాలని జాక్వెలిన్ చెప్పింది. తను కూడా ఫ్లూ లక్షణాలతో చాలా ఇబ్బందికి గురయ్యానని, వైరస్ సోకిందో లేదో తెలుసుకునేందుకు యాంటీబాడీ టెస్టులు చేయించుకుంటున్నానని లక్సెంబర్గ్ ట్రయాథ్లెట్ అలీవర్ తెలిపారు.

ఆ సమయంలోనే ఊహాన్ పరిస ప్రాంతాలలో నిర్మానుష్యంగా మారగడం తను గమనించానన్నాడు. స్థానికులు ఎవరు కూడా బయట తిరగవద్దని అక్కడి ప్రభుత్వం హెచ్చరికలు చేసినట్లు కూడా విన్నట్లు చెప్పారు. మిలిటరీ క్రీడలు నిర్వహించే ప్రాంతాల్లో ఏవేవో రసాయనాలు పిచికారీ చేయడం చూశామని, తరచూ చేసేవారన్నారు.

దోమలు, కీటకాలు రాకుండా పిచికారీ చేస్తున్నారని తాము భావించామని జాక్వెలిన్ తో పాటు పలువురు క్రీడాకారులు వెల్లడించారు. బయటి ఆహారం తీసుకోవద్దని పదే పదే నిర్వాహకులు సూచించారని, ఎందుకలా చెప్పారనేది ఇప్పుడు అర్థమవుతోందని వారు పేర్కొన్నారు. విమానాశ్రయాల్లో కూడా థర్మో స్కానర్స్ ఉపయోగించి తమ శరీర ఉష్ణోగ్రతలు రికార్డు చేశారన్నారు.

 

 

You might also like