హైదరాబాద్: జీ హెచ్ ఎం సీ ఎన్నికల పై తాము ఇప్పుడు ఏలాంటి ఆదేశాలు ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది.
మున్సిపల్ యాక్ట్ ప్రకారంగా మేయర్, కార్పోరేటర్ల రిజర్వేషన్ లు సక్రమంగా జరగలేదని రచనా రెడ్డి విన్నవించారు. ఎన్నికల్లో రిజర్వేషన్ ప్రక్రియ సక్రమంగా జరగలేదని వెంటనే ఎన్నికలను నిలుపుదల చేయాలని కోర్టును కోరింది. ఎన్నికలు మరో వారం రోజులు ఉన్న సమయంలో ఇప్పుడు తాము ఏలాంటి ఆదేశాలు ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ఎన్నికల పైన వేసిన పిల్స్, రిట్ పిటీషన్ లను అన్ని కలిపి డిసెంబర్ 23 న విచారిస్తామని హైకోర్టు పేర్కొంది. తదుపరి విచారణను డిసెంబర్ 23 కు వాయిదా వేసింది.