FbTelugu

వామ్మో… వైన్ ధర అంతనా?

లండన్: వైన్ బాటిల్ ధర మహా అయితే రెండు వేలు లేదా పది వేల వరకు ఉంటుంది. విదేశీకి చెందినది అయితే లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. వీటన్నింటిని తలదన్నే విధంగా ఈ వైన్ బాటిల్ ధర పలుకుతోంది.

వైన్ తయారు చేసేందుకు అంతరిక్షంలో పులియబెట్టారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) లో ఏడాదికి పైగా గడిపిన ఒక ఫ్రెంచ్ వైన్ బాటిల్ ను క్రిస్టీస్ అనే సంస్థ బహిరంగ వేలానికి పెడుతున్నట్లు ప్రకటించింది. ఈ బాటిల్ పేరు పెట్రాస్2000 కాగా 2019 నవంబర్ లో అంతరిక్షంలోకి పంపించిన బాటిల్లో ఇదొకటి. స్పేస్ కార్గొ అన్ లిమిటెడ్ అనే అంకుర పరిశ్రమ పరిశోధన కోసం పంపించి, 14 నెలల తరువాత భూమ్మీదకు తీసుకువచ్చింది. అయితే దీని రుచి ఎలా ఉందో తెలుసుకునేందుకు ఫ్రాన్స్ లోని బోర్డోలో ఉన్న ఇనిస్టిట్యూట్ ఫర్ వైన్ అండ్ వైన్ రీసెర్చిలో పరిశోధనలు కూడా చేశారు. అంతరిక్షంలో, భూమిలో వేర్వేరుగా పులియబెట్టిన బాటిళ్లలో రుచి వ్యత్యాసం ఉందని తేల్చారు. అంతరిక్షంలోకి వెళ్లి వచ్చిన బాటిల్ లో వైన్ సువాసనభరితంగా, మృదువుగా ఉందని గమనించారు. ఇంతటి మృదువైన, సువాసన భరిత వైన్ ధర రూ.7.37 కోట్లు పలకవచ్చని అంచనాకు వచ్చారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.