FbTelugu

హిందీ రాకుంటే ఇంత అవమానమా?: ఎంపీ కనిమొళి

కోజికోడ్: హిందీ మాట్లాడ్డం రాకుంటే ఇంతగా అవమానిస్తారా, దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం బలవంతంగా హిందీ రుద్దాలని చూస్తోందని డీఎంకే ఎంపి కనిమొళి ఆరోపించారు. ఆమె హిందీ ఇంపోజిషన్ హ్యాష్ ట్యాగ్ ను పోస్టు చేశారు.

కేరళలోని కోజికోడ్ లో విమాన ప్రమాదం గురైన ప్రాంతాన్ని సందర్శించేందుకు ఇవాళ ఎంపీ కనిమొళి వెళ్లారు. ‘‘విమాన ప్రమాద ప్రాంతానికి ఇవాళ ఉదయం నేను వెళ్లాను. అక్కడే ఉన్న సీఐఎస్ఎఫ్ మహిళా జవాన్ హిందీలో ఏదో చెబుతోంది. తనకు హిందీ రాదని, తమిళం లేదా ఇంగ్లీషులో మాట్లాడాలని సూచించాను. దానికి ఆమె మాట్లాడిన మాటలకు తనకు మతి పోయింది. హిందీ తెలియదా, మీరు భారతీయురాలేనా అని ఆమె నన్ను ప్రశ్నించడంతో కంగుతిన్నట్లు’’ కనిమొళి ట్వీట్ చేశారు.

You might also like