FbTelugu

అఖిల‌ప్రియ‌కు క‌ష్ట‌కాలం మొద‌లైన‌ట్టేనా!

క‌ర్నూలు జిల్లాలో భూమా కుటుంబం హ‌వా వేరు. ఏడేళ్ల కాలంలో ఎత్తుప‌ల్లాలు ఎన్నో చూశారు. 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్ర‌చారానికి వెళ్లి వ‌స్తూ రోడ్డు ప్ర‌మాదంలో భూమా శోభ‌నాగిరెడ్డి మ‌ర‌ణించారు.

త‌రువాత నాలుగేళ్ల‌కే నాగిరెడ్డి అనారోగ్యంతో క‌నుమూశారు. ఆ త‌రువాత నంధ్యాల‌లో భూమా అఖిల‌ప్రియ వార‌సురాలిగా రాజ‌కీయ అరంగేట్రం చేశారు. మంత్రిగా కొద్దికాలంలోనే పేరు తెచ్చుకున్నారు. ఆ త‌రువాత భార్గ‌వ్‌తో రెండో వివాహం జ‌రిగింది. వ్య‌క్తిగ‌తంగా కూడా స్థిర‌ప‌డ్డార‌నే చెప్పాలి. కానీ ఆ త‌రువాతే అస‌లు ఇబ్బందులు మొద‌ల‌య్యాయి. అఖిల ప్రియ ఒంటెద్దు పోక‌డ‌లు… భూమా కుటుంబాన్ని న‌మ్ముకున్న కుటుంబాల‌ను దూరం చేసుకోవ‌టం ద్వారా బ‌ల‌హీన‌ప‌డ్డారు.

ఏవీ.సుబ్బారెడ్డితో మొద‌లైన గొడ‌వ‌లు క్ర‌మంగా రోడ్డున‌ప‌డ్డాయి. ఈ నేప‌థ్యంలోనే అఖిల భ‌ర్త భార్గ‌వ్ తెర‌చాటు పెత్త‌నాలు మొద‌ల‌య్యాయి. కాంట్రాక్టులు, క‌మీష‌న్లు, బ‌దిలీల‌తో షాడో మంత్రిగా చక్రం తిప్పారు. దీంతో అప్ప‌టి వ‌ర‌కూ భూమా వెంట న‌డ‌చిన కార్య‌క‌ర్త‌లు క్ర‌మంగా దూర‌మ‌య్యారు. మొన్న‌టి ఎన్నిక‌ల్లో ఓట‌మికి కార‌ణ‌మ‌య్యారు. టీడీపీ అధికారంలో ఉండ‌గా.. భూమా కుటుంబానికి స‌న్నిహితుడైన ఆళ్ల‌గ‌డ్డ నేత ఏవి,సుబ్బారెడ్డిపై హ‌త్యాయ‌త్నం జ‌రిగింది. సుపారీ గ్యాంగ్‌కు రూ.50ల‌క్ష‌లు ఇచ్చి హ‌త్య చేయించే ప్లాన్ కూడా జ‌రిగింది. దీనిపై ద‌ర్యాప్తు చేప‌ట్టిన పోలీసులు కేసును చేధించారు. క‌డ‌ప‌లో ప‌ట్టుబ‌డిన నిందితుల ద్వారా ఇదంతా భార్గ‌వ్ పీఏగా ప‌నిచేసిన శ్రీనివాసుల ప్ర‌ణాళిక‌గా నిర్ధ‌రించారు. ఈ విష‌యంలో అఖిల భ‌ర్త భార్గ‌వ్ ప్ర‌మేయంపై ఆరా తీస్తున్నారు. అది కూడా నిజ‌మ‌ని తేలితే.. భూమా కుటుంబానికి రాజ‌కీయంగా క‌ష్ట‌కాలం మొద‌లైన‌ట్టేనంటూ రాజ‌కీయ‌ప‌క్షాలు అంచ‌నా వేస్తున్నాయి.

You might also like