FbTelugu

మజ్లిస్ కు షాకిచ్చిన బెంగాల్ నేత

కోలకతా: పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ఎంఐఎం అధ్యక్షుడు షాయిక్ అన్వర్ హుస్సేన్ పాషా ఆ పార్టీ అధినేత అసదుద్దిన్ ఓవైసీకి షాకిచ్చాడు.
పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు సన్నద్దమవుతున్న తరుణంలో తమ రాష్ట్రానికి రావద్దని పాషా స్పష్టం చేశాడు. మజ్లిస్ పార్టీ చీలిక రాజకీయాలు బీజేపీకీ లాభిస్తున్నాయని ఆయన అన్నారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే జరిగిందని, బెంగాల్ లో కూడా ఇదే జరుగుతుందని భావించి తృణముల్ పార్టీలో చేరినట్లు ఆయన చెప్పారు.

బిహార్ ఎన్నికల్లో మజ్లిస్ పోటీ చేయకపోయి ఉంటే ఫలితాలు వేరుగా ఉండేవని, అక్కడ చీలిక రాజకీయాలు చేయడం మూలంగానే మరోలా ఫలితాలు వచ్చాయన్నారు. త్వరలో బెంగాల్ లో అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి, ఇక్కడ కూడా మజ్లిస్ పోటీ చేస్తే బిహార్ లాంటి ఫలితాలు వస్తాయన్నారు. ఇక్కడ అన్ని మతాల వారు సామరస్యపూర్వక వాతావరణంలో జీవిస్తున్నారు, బీజేపీ గెలిస్తే పరిస్థితుతులు తల్లకిందులు అవుతాయని పాషా ఆందోళన వ్యక్తం చేశారు.

బీజేపీని నిలువరించే ఏకైక పార్టీ మమతా బెనర్జీయేనని, ఆమె గొప్ప సెక్యులర్ నేత అని పాషా కొనియాడారు. సీఏఏ, ఎన్నార్సీలకు వ్యతిరేకంగా ఆమె పోరాడారన్నారు. బెంగాల్ ప్రశాంతంగా ఉండాలంటే మమతానే మళ్లి గెలవాలని ఆయన కోరారు. ఈ కారణంగానే నేను ఎంఐఎం ను వీడి టీఎంసీలో చేరాను, అందుకే అసదుద్దీన్ ఓవైసీని ఇక్కడకు రావద్దని సూచిస్తున్నానని షాయిక్ అన్వర్ హుస్సేన్ పాషా అన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.