FbTelugu

పింఛను కోసం వెళ్లి వరదకు బలైంది

మహబూబాబాద్: వృద్ధ్యాప్య పింఛను కోసం వెళ్లిన ఓ వృద్ధురాలు వరదకు బలైన ఘటన జిల్లాలోని బేలుబెల్లి, పోలారం గ్రామ సమీపంలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే..

పోలారానికి చెందిన లాకావత్ నేజీ అనే 70 ఏళ్ల వృద్ధురాలు పింఛను తీసుకొని నడుచుకుంటూ వస్తుండగా.. స్థానిక కత్తెర వాగును దాటుతుండగా వరద ఉదృతి అధికంగా ఉండడంతో కొట్టుకుపోయింది. దీంతో అప్రమత్తమైన స్థానికులు ఆమెను బయటకు తీశారు కానీ అప్పటికే వృద్ధురాలు మృతి చెందింది.

You might also like