FbTelugu

ఏపీ సినీ థియేటర్లకు వరాల జల్లు

అమరాతి: కోవిడ్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కోంటున్న చిత్ర పరిశ్రమతో పాటు అనుబంధ వ్యవస్థలకు ప్రత్యేక రాయితీలు ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

2020 ఏప్రిల్, మే, జూన్ మాసాలకు విద్యుత్ స్థిర ఛార్జీల చెల్లింపును రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఆ తదుపరి 6 నెలల కాలానికి చెందిన విద్యుత్ స్థిర చార్జీలను వాయిదాల్లో చెల్లించేందుకు వెసులుబాటు కల్పించింది. సినిమా థియేటర్లు, మల్టిప్లెక్సులు జులై 2020 నుంచి డిసెంబర్ 2020 నెలల్లో చెల్లించాల్సిన స్థిర ఛార్జీలను వాయిదాల్లో చెల్లించేందుకు అవకాశం ఇచ్చింది. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణానికి 50 శాతం మేర వడ్డీ రాయితీ కల్పిస్తున్నట్లు పేర్కొంది. సినిమా థియేటర్లు తీసుకున్న రుణానికి వడ్డీ రాయితీ వెసులుబాటు ఆరు నెలల మారటోరియం కాలపరిమితి తర్వాత వర్తిస్తుందని స్పష్టం చేసింది.
వడ్డీ రాయితీ వెసులుబాటు మల్టీ ప్లెక్సు థియేటర్లకు లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. కోవిడ్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కోంటున్న చిత్ర పరిశ్రమ, అనుబంధ కార్యకలాపాలు, దానిపై ఆధారపడిన కార్మికులకు లబ్దికలిగేలా ఈ ఉత్తర్వులు ఇచ్చినట్టు సమాచార పౌర సంబంధాల ఎక్స్ అఫీషియో కార్యదర్శి టి.విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.