FbTelugu

ఆనందయ్య మందుకు వారం బ్రేక్

నెల్లూరు: కృష్ణపట్నం ఆనందయ్య ఆయుర్వేద మందుకు వారం రోజుల పాటు నిలిపివేయాలని ఏపి పోలీసులు ఆల్టిమేటం ఇచ్చారు. ఒక అడుగు ముందుకేసి ఆయన మందుల తయారీకి ఉపయోగించే దినుసులు, పంపిణీ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
శనివారం నాడు ఉదయమే పోలీసుల రంగంలోకి దిగి ఆయన ఇంటి చుట్టూ, టౌన్ లో ఉన్న ప్రజలను బలవంతంగా ఖాళీ చేయించి పంపించారు. ఆనందయ్య ఇచ్చే మందు కోసం ఏపితో పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున చేరుకోవడం, శాస్త్రీయత లేదని ఏపి ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తుండడం తెలిసిందే.

గత నాలుగ రోజులుగా కృష్ణపట్నంలో హైడ్రామా నడుస్తోంది. మందు పంపిణీ చేయాల్సిందేనని స్థానిక వైసిపి ఎమ్మెల్యే కాకాని గోవర్థన్ రెడ్డి, కుదరదని జిల్లా కలెక్టర్, పోలీసులు పట్టుబడుతున్న విషయం తెలిసిందే. శుక్రవారం పంపిణీ ప్రారంభించినప్పటికీ జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని నిలిపివేయించారు. ఈ విషయం ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు దృష్టికి వెళ్లడంతో ఆయన వెంటనే స్పందించి కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి, ఐసిఎంఆర్ డైరెక్టర్ జనరల్ తో మాట్లాడి మందు పంపిణీకి మార్గం సుగమం చేయాల్సిందిగా ఆదేశించారు.
ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా మందు కోసం ఎవరూ ఆనందయ్య వద్దకు రావద్దని, వారం వరకు పంపిణీ చేయడం కుదరదని నెల్లూరు జిల్లా ఎస్పి సూచించారు. మందు పంపిణీకి మార్గం సుగమం అయిన తరువాత తెలియచేస్తామని ప్రకటించారు. మందు కోసం వస్తే కేసులు నమోదు చేస్తామని జిల్లా ఎస్పి హెచ్చరించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.