FbTelugu

గుడి ముందే రోడ్డుపై పెళ్లిళ్లు

చెన్నై: కరోనా మహమ్మారి నేపథ్యంలో తమిళనాడులో వివాహాలు, విందులపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది. ప్రధానంగా ఫంక్షన్ హాళ్లు, దేవాలయాల్లో పెళ్లిళ్లపై ఆంక్షలు విధించడంతో కొత్తగా వివాహం కావాల్సిన జంటలకు ఇబ్బందులు తప్పడం లేదు.

కడలూరు జిల్లాలోని తిరువంతిపురం దేవనాథ స్వామి ఆలయాన్ని చిన్న తిరుపతిగా పేరున్నది. వివాహాల సీజన్ లో ప్రతిరోజు కనీసం వంద పెళ్లిళ్లు జరుగుతుంటాయి. తమిళనాడు పంచాంగం ప్రకారం ఈ నెల 24 నుంచి ముహూర్తాలు ఉండడంతో జనం పెళ్లిళ్లకు సిద్దమయ్యారు. దేవనాథ స్వామి ఆలయం మూసివేసినప్పటికీ ప్రధాన ద్వారం ముందే రోడ్డుపై 50 జంటలకు వివాహం జరిపించారు. వివాహాలు ఉండడంతో ఆలయం ముందు జనం గుంపులు గుంపులుగా చేరిపోయారు. పెళ్లిళ్లు చేసుకున్న తరువాత నూతన వధూవరులను తీసుకుని ఇళ్లకు బయలుదేరుతున్నారు. తేనీరు తాగి విందు కార్యక్రమం ముగించడం విశేషం.

You might also like

Leave A Reply

Your email address will not be published.