FbTelugu

ఇసుక లారీని ఢీకొన్న పెళ్లి వాహనం

ల‌క్నో: ఇసుక లారీని స్కార్పియో ఢీకొన్న ఘటనలో 8మంది అక్కడికక్కడే మృతి చెంది మరో ఇద్దరికి తీవ్ర గాయాలైన ఘటన ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని కౌశంబి జిల్లాలో ఇవాళ (బుధ‌వారం) ఉద‌యం చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వివాహ వేడుక‌కు హాజ‌రై తిరిగి స్కార్పియో వాహనంలో వ‌స్తుండ‌గా ఇవాళ ఉదయం వేగంగా వచ్చిన ఓ ఇసుక లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో 8 మంది అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమద సమయంలో కారులో 10 మంది ప్రయాణికులు ఉన్నట్టుగా.. తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.