FbTelugu

అనాథాశ్రమంలో పెళ్లి రిసెప్షన్

వాషింగ్టన్: ఘనంగా పెళ్లి చేసుకుని పసందైన వంటకాలతో విందు ఇవ్వాలని అనుకున్నారు ఆ జంట. కాని అనుకున్నవి జరగవు కదా. కరోనా రావడంతో వారి ఆశలు తల్లకిందులు అయ్యాయి.

ప్రజలందరూ కరోనాతో అల్లాడుతుంటే గ్రాండ్ గా పెళ్లి, విందు చేసుకోవడం అవసరమా అని భావించారు. వెంటనే ఆ జంటకో ఆలోచన తట్టిందే తడవు అమలు చేశారు. పెళ్లి విందు వేడుకను ఒక అనాథాశ్రమానికి మార్చారు.
సిటీ మిషన్ అనే స్థానిక ఆశ్రమంలో నూతన జంట రిసప్షన్ జరుపుకున్నారు. ఆశ్రమంలో నిరాశ్రయులకు స్వయంగా వారే ప్రేమతో వడ్డించారు. ఈ దృశ్యాలను ద సిటీ మిషన్ వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లో చేసింది. వీరి ఆలోచనను పలువురు అభినందించారు.

You might also like